Friday, 20 February 2015

కవిత నెం82:నీతో నీవు కాసేపు

కవిత నెం :82

నీతో నీవు కాసేపు 
**************************

ఎప్పటికప్పుడు నువ్వే గ్రేట్ గా 
చేసిన తప్పులో ఒప్పే నీదిగా 
ఎందుకలా ఎదురుదాడిలా 
ఉంటావిలా వితండవాదిలా 
బదులే లేని ప్రశ్నలా 
మనసే లేని మనిషిలా 
పాతుకుపోయిన వేరులా 
పనికి మాలిన చెత్తలా 

ఉండిపోయావు నీవే నీలా 
ఒక్కడిలా ఒక్కడిలా    

ఒక్క క్షణమైనా గుర్తించావా - అది నిన్ను దాటి పోయింది 
ఒక్క చోటునైనా గమనించావా - నీ రాణింపు ఎక్కడుందని    //ఒక్క //

ఎదగాలిరా మనిషి పట్టుదలతో 
ఎదిగి ఉండాలి మనిషి పేరు ప్రఖ్యాతలతో 
ఎదుగుదలకి అవసరం ఓర్పు 
ఓర్పు చూపించటం కూడా ఒక నేర్పు 
ఆ నేర్పు లేని జీవితంలో ఉండదు మార్పు 
ఇది ప్రపంచమే ప్రకటించిన తీర్పు 

ఆలోచన నీకుంటుంది అది యోచిస్తే సాధ్యమే 
సమర్ధత నీకుంది అది నీలోనే దాగుంది 
లక్ష్యం నీ వెంటుంది అది సాధనలో వస్తుంది 
కష్టం ఒక్కటే నీ ఫలితాన్ని చూపించదు  
సమయానుభవమే అణుకువ నేర్పించును 

నిజమెప్పుడూ నేరుగా ,సూటిగా ఉంటుంది 
అబద్దమే అందంగా నిజాన్ని దాచేస్తుంది 
ఆవేశంతో అభిమానించటం మరువకు 
కొనియాడి వైరాలను నీ వెంటరానీయకు 
ముక్కుసూటితనం తప్పు కాదు 
మృదులంగా మాట్లాడి చూడు 

నీ కంటూ నువ్వు ప్రత్యేకమే 
కాని అందరిలోనూ కలవలేకపోతే నువ్వు ఏకాకివే 
నీ నవ్వు నువ్వు చూడటం కాదు 
పదిమంది ఆ నవ్వుని చూసి స్నేహం చెయ్యాలి 
నీ కోపం శాపం కాకూడదు 
ఆ కోపాన్ని నీ ముఖకదలికలోకి రానీయకు 
నువ్వంటే నీకు ఇష్టమే 
అందరూ నువ్వంటే ఇష్టపడేటట్టు నువ్వుండాలి 

//రాజేంద్ర ప్రసాదు // 20. 02. 15 //

Related Posts:

  • కవిత నెం 203:నిజమైన దీపావళి రావాలనీ ........ కవిత నెం :203 నిజమైన దీపావళి రావాలనీ ........  స్వార్ధానికి బలవుతున్న అనాధలను చూడు  కోడిపిల్లలా మారుతున్న ఆడపిల్లల బ్రతుకు చూడు  వ్యస… Read More
  • కవిత నెం 200:గుండె చప్పుడు కవిత నెం :200 గుండె చప్పుడు  నాలో నేనే నీలా  నీలో నీవే నాలా  ఒక్కసారిగా ఒక్కటై  ప్రతిస్పందన మొదలై  మనలో మనమే చేరగా  … Read More
  • కవిత నెం 210 :ఒక్కడినే కవిత నెం :210 ఒక్కడినే  నాలో నేనే ఒక్కడినే  నాతో నేనే ఒక్కడినే  నా ముందు నేను  నా వెనుక నేను  నా చుట్టూ నేను  నేనంతా … Read More
  • కవిత నెం 208:నేను కవినేనా ? కవిత నెం :208 నేను కవినేనా  నేను కవినేనా  మనసు పెట్టే రాస్తాను  నా కాలానికి పని చెబుతుంటాను  మరి నేను కవినేనా ? అక్షరాలను కలుప… Read More
  • కవిత నెం 202:రైలంట రైలు కవిత నెం : 202 రైలంట రైలు దీనికి ఉండదంట వేలా పాలు ఇది తిరుగుతాది ఎన్నో మైళ్లు కూస్తూ ఉంటుంది రైలు బెల్లు  ఆగిన చోట ఉండదు ప్రతీ చోటా ఇది ఆగదు కా… Read More

0 comments:

Post a Comment