Tuesday, 14 February 2017

కవిత నెం 270: నిన్నే ప్రేమిస్తా

కవిత నెం :270

*నిన్నే ప్రేమిస్తా **

ప్రేమను ప్రేమగా పొందాను ,పొందుతున్నాను
ప్రేమను ప్రేమగా చూడటమంటే తెలుసుకున్నాను
ప్రేమకు అర్ధమే నీవని ,నీవుంటే ఏమీ అవసరంలేదని
ప్రేమలోన దాగున్న ప్రేమను నాకోసం పంచావు
ప్రేమతో నన్ను ప్రేమిస్తూ నా ప్రాణమై నిలిచావు
ప్రేమాక్షర భీజాలను నాలో నాటావు
ప్రేమాక్షయ పాత్ర లాగా నిరంతర ప్రేమను ఇస్తున్నావు
నిన్ను ప్రేమిస్తూ ,నాలోన నీపై ప్రేమను ప్రేమిస్తూ
''ప్రేమ '' మంత్రం జపిస్తూ ప్రేమికుడిలా పయనిస్తూ
నీ ప్రేమ హస్తంతో ప్రేమమయం లో విహరిస్తూ
ప్రేమతో నిండిన హృదయాలతో జీవిస్తున్నాము
ప్రేమంటే కలవరం అనుకున్నా కాని
నువ్వొచ్చాక తెలిసింది నీ ప్రేమ పొందటం ఒక వరం అని
అందుకే నిన్ను ప్రేమిస్తున్నాను
ప్రేమిస్తాను ..... ప్రేమిస్తూనే ఉంటాను

Related Posts:

  • కవిత నెం50:మహిషాసురమర్దిని కవిత నెం :50 మహిషాసురమర్దిని ********************  రంభుడు అనే రాక్షసుణి పుత్రుడు మహిషుడు   బ్రహ్మ వరంతో వరగర్వితుడై లోక కంటకుడయ్… Read More
  • కవిత నెం48:నేను మనిషినా కవిత నెం :48 నేను మనిషినా జవాబుచెప్పగలను కాని ప్రశ్నించలేను ప్రేమించగలను కాని ద్వేషించలేను బ్రతిమాలగలను కాని కోపించలేను సహాయం చేయగలను కాని అర్దించ… Read More
  • కవిత నెం47:వరకట్నం కవిత నెం : 47//వరకట్నం // వరకట్నం ........  ఇది వధువు తల్లిదండ్రులకు ఆత్మస్థైర్యమైతే  వరుడికి మాత్రం అంటుకున్న దురహంకారం  జీవం పోస… Read More
  • కవిత నెం51:ఒక మైలు రాయిని నేను కవిత నెం :51 ఒక మైలు రాయిని నేను ****************** ఒక మైలు రాయిని నేను  నా  ప్రయాణంలో కాని కదిలే మైలు రాయిని నేను నా ఎదురుబాటలో ఇది… Read More
  • కవిత నెం49:శక్తి స్వరూపిణి కవిత నెం :49 శక్తి స్వరూపిణి  ***************** అంబపరమేశ్వరి  ,అఖిలాండేశ్వరి ,ఆదిపరాశక్తివే  శ్రీ భువనేశ్వరి , రాజ రాజేశ్వరి ,బాలత్ర… Read More

0 comments:

Post a Comment