Monday 20 February 2017

కవిత నెం274:మన ఆవు గురించి మనం తెలుసుకుందాం

కవిత నెం  : 274

అంశం : మన ఆవు గురించి మనం తెలుసుకుందాం
(వ్యాస రచన )

గోవు అందరికీ తల్లి .
అందుకే వాడుకలో గోమాత అని పిలుస్తాము .
గోవు పవిత్రతకు మరియు శుభానికి గుర్తు .
హిందువులకు ఎంతో పవిత్రమైనది , ఆరాద్యమైనది
ఆవులో సకల దేవతలు కొలువుంటారని ప్రసిద్ధి
గోవు కుడి క్రొమ్ము ప్రక్క బ్రహ్మ ,
ఎడమ ప్రక్క విష్ణువు ,
కొమ్ముల చివర సకల తీర్ధాలు ,
నుదుట శివుడు ,
ముక్కునందు సుబ్రమణ్యేశ్వరుడు ,
చెవులందు అశ్వనీ దేవతలు ,
నేత్రములందు సూర్యచంద్రులు ,
నాలుకయందు వరుణుడు ,
గోవు ''హిం' కారమున సరస్వతీ దేవి ,
గండ స్థలాల యమ ,ధర్మ దేవతలు ,
కంఠమున ఇంద్రుడు ,
వక్షస్థలాన సాధ్యదేవతలు ,
నాల్గు పాదాల ధర్మార్ధకామమోక్షాలు ,
గిట్టల మధ్య గంధర్వులు ,
పృష్ట భాగాన ఏకాదశరుద్రులు ,
పిరుదులు పితృ దేవతలు ,
మూత్రమున గంగ ,
పాలలో సరస్వతీ ,
భగమున లక్ష్మీ భావన చేయదగినవారు ,
ఆవుపొదుగు అమృతసాగర స్థానం ,
ఇలా గోవు అగ్నిమయం ,అమృత మయం ,దేవమయం .
ఇలా గోవు యొక్క సమస్త అంగములందు సమస్త దేవతలు కలరు .
ముక్కోటి దేవతలకు నిలయం గో మాత .
అందుకే ఆవును ముందు ప్రవేశపెట్టి , ఆ తర్వాతనే నూతన గృహంలో యజమాని ప్రవేశిస్తాడు .
అందుకే గోమాతకి ప్రదక్షిణం చేస్తే సకలదేవతలకి చేసినంత ఫలితం
గోవు పాలలో ఎన్నో ఔషధ గుణాలున్నాయని ప్రతీతి
తల్లుల వద్ద పాలు లేని పిల్లలకు ఆవుపాలే శరణ్యం
సకలదోష నివారణకు ఆవు పంచితాన్నివ్వటం హిందువుల ఆచారం
గోపూజ , గో రక్షణ , గోదానం , గో వధ నిషేధం ప్రతి హిందువు కర్తవ్యం .
భారతదేశానికి రైతు వెన్నెముక , అటువంటి రైతు వెన్నెముక వంటిది ఈ ఆవు .


ప్రాచీన పవిత్ర భారతీయ సంస్కృతి సంపదలకు ప్రతీక గోమాత
భారతీయులకు అనాదినుంచి ఆరాధ్యదేవత
మానవ జాతికి ఆవుకన్నా మిన్నగా ఉపకారం చేసే జంతువు మరొకటి లేదు.
గోసేవ వలన ధీరోదత్త గుణాలు అలవడగలవనీ , ధన సంపదలు వృద్ధి పొందగలవనీ ప్రశంసించబడింది .
మాహానుభావులెందరో గోసంపద యొక్క రక్షణావశ్యకతను నొక్కి వక్కాణించారు .
శ్రీ కృష్ణ భగవానుడు స్వయంగా గోమాతను పూజించి ,సేవించి గోపాలుడైనాడు .
దిలీప చక్రవర్తి తన ప్రాణాలను త్యాగం చేసేందుకు  సైతం వెనుకాడలేదు .
జమదగ్ని గోరక్షణకై ఆత్మత్యాగం చేసాడు .
గోవులే ఐశ్వర్యం .గోవులే ఇంద్రియ బలవర్ధకాలు ..

ప్రాణవాయువును (ఆక్సిజన్) తీసుకుని ప్రాణవాయువును(ఆక్సిజన్) వదిలే ఏకైక ప్రాణి
విషాన్ని హరించే గుణం ఆవుపాలకుంది .
గోమూత్రం ప్రపంచంలోనే సర్వోత్తమైన కీటకనాశిని .
గోమూత్రం గంగాజలమంత పవిత్రమైనది .
ఇళ్లను , వాకిళ్ళను ఆవుపేడతో అలికితే రేడియోధార్మిక కిరణాలనుండి మనల్ని కాపాడుకోవచ్చు .
ఒక తులం ఆవు నెయ్యిని యజ్ఞంలో వాడితే ఒక టన్ను ప్రాణవాయువు ఉత్పత్తి అవుతుంది .
ఆవును దర్శించి రోజులోని పనులు ప్రారంభించటం ఎంతో శుభశకునంగా భావించబడింది .

గోవు యొక్క పాలు (గో క్షీరం) , పెరుగు (గో దధి) , నెయ్యి , మూత్రం , పేడ (గోమయం) మొదలగు వాటిని
'పంచ గవ్యములు' అంటారు .
ఆవు పేడలో లక్ష్మీ దేవి నివసిస్తుంది .
గో మూత్రం పుణ్యజలం
గో సేవ ఇచ్చును కోటి యజ్ఞ యాగాదుల పుణ్యఫలం
భూమాత గో రూపంలోనే దర్శనమిస్తుందని శ్రీ మద్బాగవతం లో ఉంది .
గోధనంతో సమమైన ధనం లేదు .
గోవును స్తుతించటం , గోవును గూర్చి వినటం , గోదానం , గోదర్శనం గొప్ప పుణ్యాన్ని ఇచ్చేవని ఎన్నో విశేషాలలో చెప్పబడినాయి .















0 comments:

Post a Comment