Wednesday, 23 November 2016

కవిత నెం 236:ప్రేమంటే నా మాట లో

కవిత నెం : 236

* ప్రేమంటే నా మాట లో *

ప్రేమంటే నిన్ను కోరుకోవటం  కాదు
ప్రేమంటే నీ మనసుని కోరుకోవటం

ప్రేమంటే నిన్ను వేధించటం కాదు
ప్రేమంటే నిన్ను ఆరాధించటం

ప్రేమంటే నిన్ను శాసించటం కాదు
ప్రేమంటే నీకోసం శ్వాస వదిలెయ్యటం

ప్రేమంటే నిన్ను బందించటం కాదు
ప్రేమనే బంధంలో జీవించటం

ప్రేమంటే నిన్ను ద్వేషించటం కాదు
నీ ప్రేమకై  కాలమంతా పరితపించటం

ప్రేమంటే స్నేహం కాదు
స్నేహం ప్రేమగా మారవచ్చు
ప్రేమించిన ప్రేమికుడు స్నేహితుడిగా ఉండలేదు
కానీ ప్రేమ దక్కిన ,లేకున్నా  భక్తుడుగానే ఉంటాడు

ప్రేమ కాలాన్ని నిర్బందించలేకపోవచ్చు
కాని నిజమైన ప్రేమ నిరీక్షణలో గెలుస్తుంది

ప్రేమంటే అర్ధమయ్యినట్టే ఉంటది
కాని దాని పరమార్ధం నువ్వెంత వెతికినా దొరకదు 

Related Posts:

  • కవిత నెం :19 //జెండా // కవిత నెం :19 //జెండా // మూడు రంగుల జెండా ఇది మువ్వన్నెల జెండా  రెప రెప లాడుతూ రివ్వున ఎగిరే జెండా  కులమత బాష బేదాలకు అతీతమై వెలసిన జెండా… Read More
  • కవిత నెం 17:అమ్మంటే కవిత నెం :17 అమ్మంటే ప్రేమకు అపురూపం  అమ్మ  అను పిలుపే ఆయుష్షునిచ్చే అమృతం  కనిపించే మమతల కోవెల అమ్మ  కదిలొచ్చే  ఆమని … Read More
  • కవిత నెం16:చందమామ కవిత నెం :16 అల్లంత దూరాన ఓ చందమామ  ఆకాశమున పండులాగా మా చందమామ  పాలమీగడ తెల్లదనంతో ఓ చందమామ  పసి పాపలకు ముద్దొస్తావ్ మా చందమామ  … Read More
  • కవిత నెం15 :ప్రేమ నౌక కవిత నెం :15 *ప్రేమ నౌక * ఎర్రని మబ్బుల సైతం  నా ఎదని కమ్మేస్తున్నాయి  నీ కోసం అన్వేషణ చేస్తున్న నన్ను  అడుగడుగుకి ఆపదలు అడ్డుకొంటు… Read More
  • కవిత నెం27:నా దేవి కవిత నెం :27 నాలో సగం నా రూపంలో ప్రతి రూపం నా భావాలకు అక్షర రూపం నా కన్నులకు నీవు కార్తీక దీపం నా మనసుతో ముడిపడిన మరో వసంతం నా హృదయములో నిలచిన పారిజ… Read More

0 comments:

Post a Comment