Thursday, 3 November 2016

కవిత నెం 232 :కన్నీటి చుక్క

కవిత నెం  :232

***** కన్నీటి చుక్క *****

ఆకాశంలో పొడుస్తుంది వెలిగే చుక్క 
మన అంతరాళంలో  ప్రవహిస్తుంది ఈ కన్నీటి చుక్క 

వెక్కి వెక్కి ఏడుస్తాము మనసుకి కష్టమనిపిస్తే  
దుఃఖి దుఃఖి రోధిస్తాము ఎవరైనా దూరమయితే 

బాధలో అయినా ,ఆనందంలో అయినా మన స్పందన ఒకటే 
ఆ స్పందనలో స్పర్శ లా చేరి పంచుకునే చెలిమే ఈ కన్నీటి చుక్క 

వెచ్చగా  చెక్కిలిని ముద్దాడి నువ్వు ఒంటరి కాదు అని గుర్తుచేస్తుంది 
మానవత్వాన్ని చూపే మనసు ఉందని మనకు తెలియచేస్తుంది 

ఉప్పొంగే హృదయం ఉందని వేదనతో అది చెబుతుంది 
భరించే బాధలో  ఓర్పు దాగుందని నేర్పుగా చూపుతుంది 

మౌనం వహించు వేళ కోఠి  ప్రశ్నలకైనా జవాబులా నిలుస్తుంది 
పశ్చాత్తాపం చెందిన వేళ చేసిన తప్పును   సర్దుబాటు చేస్తుంది 

చెదిరిన బ్రతుకులలో శిధిలమై  బావురుమంటుంది 
మండే గుండెలో అగ్ని సెకలమై ప్రతీకారమై విజృభిస్తుంది 

ప్రణయంలో జారిన కన్నీటి చుక్క వేయి భావాలను పలికిస్తుంది 
ఎదురుచూపులో ఒదిగిన కన్నీటి చుక్క హిమబిందువులా వికసిస్తుంది 

తల్లడిల్లే తల్లి మనస్సులో అనురాగంతో నిండి  అజరామరమవుతుంది 
చినుకులా పుట్టి ,సంద్రమై మారి అమృతాన్ని మనకు అందిస్తుంది 

కరిగిన కన్నీటి వ్యధలో నిజమెంతో దాగుంటుంది 
నలిగిన బాధలో  సరికొత్త ఆలోచన లా  పుడుతుంది 

కనుకొనల లోని  కన్నీటి చుక్క ఎద లోగిలిలో హత్తుకునిఉంటుంది 
మనసు కోటలో సుగంధం  చేరి తులసీ తీర్ధమై ఊపిరినిస్తుంది




















Related Posts:

  • కవిత నెం 25(అంతా ఒక్కటే) కవిత నెం : 25 కాలానికి లేదు సమాంతరం  ధనిక ,బీద గొప్పల తారతమ్యం  మానవ జన్మ అంటే ఇంతేరా  మంచి చెడు ,కష్ట సుఖాల బ్రతుకేరా  దనముకు ఖ… Read More
  • కవిత నెం 26:అర్ధనారీశ్వర తత్వం ... కవిత నెం :26 అర్ధనారీశ్వర తత్వం ...  అవనిలో కొలువై యున్న దైవ సమానత్వం  విధి రాసిన వింత ఫలితం  అనాధలు కాదు , మన తోటి సమానులు  శుభ… Read More
  • కవిత నెం24:పట్న వాసం కవిత నెం :24 *పట్న వాసం *  పల్లెలన్నీమాయమై - పట్నాలవుతుండే  పెరుగుతున్న పట్నాలలో - ఇరుకుటిల్లు పెరిగెనే  ఎదుగుతున్న సమాజం -స్వార్ద రహి… Read More
  • కవిత నెం27 కవిత నెం :27 మనసును చదవగలరా ఎవరైనా ఆత్మను అవగాహన చేసుకోగలరా ఎవరైనా అర్ధం పర్ధం లేని జీవితంలో 'అపార్ధాల' పంటలు పండిస్తున్నారు  మమకారం చూపించే మన… Read More
  • నేనేప్రేమా(357) నాకు లేడీస్ తో మాట్లాడటం రాదునా మాట కరుకునాకు ఉండదు బెరుకుఅందుకే నేనంటే అందరికీ చిరాకునువ్వు దూరంగా ఉండాలనిఅనుకోవటంలో తప్పు లేదుఆడపిల్లలతో కేరిం… Read More

0 comments:

Post a Comment