Tuesday 8 November 2016

కవిత నెం 234:నోటు నోటు నువ్వేం చేస్తావ్ అంటే !

కవిత నెం :234


నోటు నోటు 
నువ్వేం చేస్తావ్ అంటే !!!!!!!

నీకు చిల్లర దొరకకుండా తిప్పిస్తా 

నీతో ఉంటూ ,నీకే పనికి రాకుండా  ఉంటా 
పేదవానికి అందకుండా తిరుగుతా 
ధనవంతులకు 'దగ్గర బంధువు'' నవుతా 
బ్యాంకులను కొల్లగొడతా 
కమీషన్ దందాలకు తెరచుడతా 
లంచాల రుచి చూపెడతా 
లంచగొండిలను సృష్టిస్తా 
దొరికినంతవరకు దోచేయ్ మంటా 
తరతరాలకు ఆస్థిని కూడబెడతా 
కష్టపడి పని చెయ్యమంటా 
సోమరితనంతో నన్ను సంపాందించమంటా 
కుమ్ములాటకు దిగి కొట్టుకుచావమంతా 
మత కల్లోలం కు నవాబ్ నవుతా 
విద్వంసాలకు వెర్రి జెండా ఎగురవేస్తా 
నాకు నేనే ''హవాలా '' మారి దేశాలు తిరుగుతా 
నాకు అడ్డొస్తే దేన్నైనా కొంటా లేకపోతే లేపేస్తా 
నన్ను చూసి ఆశ పెంచుకోమంటా 
నన్ను చూసి నా వెంట రమ్మంటా 
స్నేహాల మధ్యన చిచ్చు నే బెట్టన్నా 
కన్నవారి కడుపు కొట్టి కంత్రీ నేనవ్వనా 
నమ్మకాన్ని చూపి మోసాన్ని నిలబెట్టనా 
నానా చంకలు నాకించి ఆకలినే చంపనా 
నల్లధనంలా మారి కుబేరుల గుండెల్లో నిద్రపోతా 
బడాబాబుల  చేతిలో కీలు బొమ్మనై సాగిపోతా 
ప్రభుత్వాలను పడగొడతా -రాజకీయాలను నిలబెడతా 
కబ్జాలు ,భూ దందాలు , బెట్టింగ్ లు చేస్తా 

అణు శక్తిని పుట్టిస్తా - అణు ధ్వంసంతో నాశనం చేస్తా 
మానవ హారం చేస్తా - మానవ బాంబు గా మారి కల్లోలం సృష్టిస్తా 

అందాలకు కారణం నేను - అనర్ధాలకు మూలం నేను 

నన్ను నాశనం చేసినా - తిరిగి నేనేగా పుట్టాలి 
నాతోనే ప్రణామం  - నాతోనే ప్రమాదం 

- గరిమెళ్ళ గమనాలు //19. 11. 2016 //






0 comments:

Post a Comment