Tuesday, 29 November 2016

కవిత నెం 239:అర్ధమయ్యి పోయే నీ ప్రేమ

కవిత నెం  :239
*అర్ధమయ్యి పోయే నీ ప్రేమ * నీకు నువ్వే పలకరిస్తావు 
నీకు నువ్వే పచ్చి అంటావు 

నాలోన అలజడి జ్వలింపచేస్తావు 
నీకు నువ్వే దహనమవుతావు 

నా చుట్టూ నువ్వు గీత గీస్తావు 
నన్ను చుట్టుకుంటూ నా దాని వంటావు 

నాకోసం వర్షమై కురుస్తూ ఉంటావు 
నాకు మాత్రం ఎండమావిని మిగులుస్తావు 

నీ హృదయంలో స్పందన నాదంటావు 
నన్ను మాత్రం శిల్పంలా ఉండమంటావు 

కనిపిస్తావు - వలపిస్తావు 
కోపిస్తావు - క్షమిస్తావు 

ప్రేమ నీవై  - ప్రేయసి నీవై - జీవితం నీవై 
ప్రపంచాన్ని నాకు పరిచయం చేసావు 

నా ప్రేమను త్రుంచి నీ లోకంలోకి జారుకున్నావు 
భరించమని సూచనిచ్చి భస్మాన్ని నాకు ఇచ్చావు 

ఎదురుచూస్తానో - ఎడారినవుతానో 
మరణమవుతానో - మరో జ్ఞాపకం అవుతానో 
నా  ప్రేమ ప్రపంచంలో - నా కలల రాజ్యం లో 

- గరిమెళ్ళ  గమనాలు // 29. 11. 2016//



Related Posts:

  • నేనేప్రేమా(357) నాకు లేడీస్ తో మాట్లాడటం రాదునా మాట కరుకునాకు ఉండదు బెరుకుఅందుకే నేనంటే అందరికీ చిరాకునువ్వు దూరంగా ఉండాలనిఅనుకోవటంలో తప్పు లేదుఆడపిల్లలతో కేరిం… Read More
  • కవిత నెం 25(అంతా ఒక్కటే) కవిత నెం : 25 కాలానికి లేదు సమాంతరం  ధనిక ,బీద గొప్పల తారతమ్యం  మానవ జన్మ అంటే ఇంతేరా  మంచి చెడు ,కష్ట సుఖాల బ్రతుకేరా  దనముకు ఖ… Read More
  • కవిత నెం27 కవిత నెం :27 మనసును చదవగలరా ఎవరైనా ఆత్మను అవగాహన చేసుకోగలరా ఎవరైనా అర్ధం పర్ధం లేని జీవితంలో 'అపార్ధాల' పంటలు పండిస్తున్నారు  మమకారం చూపించే మన… Read More
  • 358 (వలపుతెర) నా మనసు నీ సాంగత్యం కోసం ఎదురుచూస్తుంటేనువ్వేమో నా మనసుని ఎప్పుడు గెలుద్దామా అని చూస్తున్నావ్నువ్వు నాతో ఉన్నావని తెలుసుగా నీ జతలేని నేను ఒ… Read More
  • కవిత నెం 26:అర్ధనారీశ్వర తత్వం ... కవిత నెం :26 అర్ధనారీశ్వర తత్వం ...  అవనిలో కొలువై యున్న దైవ సమానత్వం  విధి రాసిన వింత ఫలితం  అనాధలు కాదు , మన తోటి సమానులు  శుభ… Read More

0 comments:

Post a Comment