Sunday 20 November 2016

మినీ కధ 1 :ఎలుకమ్మ ర్యాగింగ్

మినీ కధ 
** ఎలుకమ్మ ర్యాగింగ్ ***

మా ఇంటి అలమరలో ఉంది ఒక ఎలుక 
ఎప్పటి నుంచో వేసింది పాగ 
దొరకకుండా తిరుగుతుంటాది బాగా 
ఓ అల్లరి చేస్తుంది కిర్రు కిర్రు మనే లాగా 
పట్టుకుందామంటే చూపిస్తాది దాని తోక 
సబ్బులు ,బియ్యం ,కూరగాయలు ,బట్టలు 
ఏది కనపడితే వాటిని వదలదు ఈ ఎలుక 
ఒకసారి తలుపులు మూసి పెట్టాను పొగ 
మా ఇల్లు మొత్తం అది కమ్ముకోగా 
ఎలుక మాత్రం ఉంది నిబ్బరంగా 
మా కొంపకంటెను పొగ సెగ దట్టంగా 
దానితో నాకు ఒళ్ళు మండింది పూర్తిగా 
ఒక పొడవాటి కర్రతో దానిని వెంబడించగా 
ఎలుక చావలేదు , కర్ర విరగలేదు కాని 
మా ఇంట సామాన్లు ద్వంసమే అయ్యెనుగా 
నాలో సహనం నశించి చిరాకు పెరగంగా 
ఎలుక మందు ఒకటి కొని దానికి ఎర చూపంగా 
గ్రహించి అది ఆ బుట్టలో పడక సంబరపడెనుగా 
ఇంతలో దానిని పట్టి నేలకేసి కొట్టగా 
చావు దెబ్బ తిని అది పరుగున పోయెనుగా 
హమ్మయ్య అనుకుని నా మనసు స్థిమితం అయ్యెగా 

\\ గరిమెళ్ళ గమనాలు //21.11. 2016

0 comments:

Post a Comment