Tuesday 8 November 2016

కవిత నెం 233 :చదువుల బరువులు

కవిత నెం  :233

*** చదువుల బరువులు ****

చిట్టి చిట్టి చేతులకి బారెడు బాధ్యతలు 
బుడి బుడి నడకలకి ఈడ్చలేని బ్యాగుల మోతలు 

ఏం నేర్పుతున్నాయి పాఠశాల చదువులు 
ఏం  చదవగలరు ఈ చిన్నారి బాలలు 

పొంతన లేని పాఠ్యంశాలు , చేరుకోలేని గమ్యాలు 
అందుకోలేని పోటీలు , చిన్నారులకు అవి శాపాలు 

మేమే గొప్ప అంటూ పాఠశాలల  ప్రచారాలు 
అర్ధంలేని మితిమీరిన ఉపాధ్యాయ బోధనలు 
వారి వేగాన్ని అందుకోలేక చిన్నారుల అవస్థలు 
నిస్సహాయ స్థితి లో చిక్కుకునే కన్నవారి హృదయాలు 

ఆట పాటలకు నోచుకోలేని పసితనపు పావురాలు 
అల్లరిని మరచి అయోమయంలో పడే అమాయకచూపులు 

యజమానుల వెకిలి చేతులకి బలయ్యే బాల భారతామణిలు 
చెప్పుకోడానికే ''బాలల దినోత్సవం '' గా పాఠశాలల ప్రదర్శనలు 

ఆలోచన చెయ్యండి ఓ అధ్యాపకులారా ,పాఠశాలల సంస్థాపకులారా 
మనకోసం , మన తరాల వారికోసం కాదు  ఈ విద్యా సంపదలు 

శాశ్వతంగా  ,సుస్థిరంగా దేశ భవితను మార్చేదే ఈ నేటి బాలలు 
వారి అవసరాలనెరిగి , జీవిత మార్గాలకు పునాదులు కండి 

ఇదే ఇదే ఇదే  మా హృదయ సంకల్పం 
ఇదే ఇదే మీరిచ్చే మరో ''విజ్ఞ్ఞాన బాలల వికాస కేంద్రం ''

- గరిమెళ్ళ గమనాలు 

0 comments:

Post a Comment