Monday 7 September 2015

కవిత నెం167:వెంటాడే వలపు

కవిత నెం :167
*వెంటాడే వలపు * నిద్రపోదామన్నా నీ నీడ నన్నే వెంటాడుతుంది
నిదురిస్తే ,నీ రూపం తట్టి లేపుతుంది
మేల్కొని వుంటే , నీ తలంపు మై మరపిస్తుంది
మైకంలో ఉన్న మనిషి ఎలా ఉంటాడో
అలా నీ మైకంలో పది మత్తులో మునిగి తేలుతున్నా
మొహమాటంతో ఈ మాట నీతో చెప్పలేకునా చెలీ 
నే పడుకుంటే పక్కమీద పరుపులాంటి పాన్పు నీవై,
నా తలకింద దుండు లాంటి వెచ్చని ఒడి నీవై,
నే కప్పుకునే దుప్పటిలాంటి పరువం నీవై,
ప్రతి రూపం నీవే , ప్రతి చోటా నీవే
ప్రకృతి జారవిడిచిన పసిడి వెన్నెల లేడివి నీవై
చేరాయి నా ఊహలు నీ సుమధుర కెరటాల లోగిళ్ళలో 

!!!!!!!!!!!!
గరిమెళ్ళ రాజా


0 comments:

Post a Comment