Monday, 7 September 2015

కవిత నెం 176:నీ కోసం

కవిత నెం :176

నీకోసమే ఉన్నా
నీకోసమీ జన్మా
నీ కోసమై అన్వేషణ

నీ కోసమై ఆలోచన
నీ కోసమై నా తపన
నీ కోసమై నిరీక్షణ

నా కన్నుల్లో తడి ఆరదు నీ కోసం
నా గుండెల్లో దడ తగ్గదు నీ కోసం
నా శ్వాసలో ఊపిరి నిలిచే నీ కోసం
నా అడుగుల పయనం  సాగెను నీ కోసం

నా మనసులో మౌనం పెరిగెను నీ కోసం
నా గొంతులో రాగం పలికెను నీ కోసం
నా జీవిత గమ్యం నీ కోసం
నా జననం మరణం నీ కోసం

నా క్షణ క్షణ కాలములో అక్షరం నీవు.
నీ నామ జపముతోనే ,నా రాతను రాస్తున్నాను
విది తీరు ఎలాగున్నా , నా వేదన ఆగదు ప్రియా
నీ తోడు కోసం , ఎదురుచూస్తుంటా నా జన్మంతా

గరిమెళ్ళ రాజా

Related Posts:

  • కవిత నెం : 317 (పసిడి కిరణాలు) కవిత నెం : 317 * పసిడి కిరణాలు * ముద్దు ముద్దు పిల్లలు ముత్యమల్లె ఉందురు ఆ పాల బుగ్గలు లేలేత మొగ్గలు పసి బోసి నవ్వులు పసిడి కాంతి మెరుపులు అమాయకపు చ… Read More
  • కవిత నెం :316(తెలుగు భాష) కవిత నెం :316 * తెలుగు భాష * తేనెలొలుకు భాష మన ''తెలుగు భాష '' అమ్మలాంటి కమ్మనైన భాష మన ''తెలుగు భాష '' సంస్కృతిలో చక్కెరదనంబు నిచ్చు భాష మన ''తెలు… Read More
  • కవిత నెం 275:*గోవు (గో మాత)*  కవిత నెం :275 *గోవు (గో మాత)* పరమ పవిత్రతకు , శుభానికి సూచిక 'గోవు' అనాదికాలం నుంచి ఆరాధ్యదైవం 'గోవు' భూమాత ధరించిన రూపం ' గోవు ' ఆదిశక్తి అంశ… Read More
  • కవిత నెం :318 (కొడుకు ఆవేదన) కవిత నెం :318 * కొడుకు ఆవేదన * అమ్మలకు ఎప్పుడూ కూతుళ్లపైనే అజా ,ఆరా కొడుకులంటే ఎందుకు ఆమెకి కన్నెర్ర కొడుకంటే కసాయివాడా ,కనికరం లేనివాడా ? కూతురంటే… Read More
  • కవిత నెం 207:నాడు -నేడు 'దేశం ' లో కవిత నెం :207 నాడు -నేడు 'దేశం ' లో  ఒకప్పుడు  దేశ స్వాతంత్రం కోసం  మన స్వేచ్చ కోసం  ఓడారు ,పోరాడారు -గెలిచారు  అన్ని కులా… Read More

0 comments:

Post a Comment