Monday 7 September 2015

కవిత నెం168:ఆమె


కవిత నెం :168
ఆమె
ఆమె పేరంటే ఇష్టం.
ఆమె రూపంటే ఇష్టం
ఆమె కాలికున్న మువ్వలంటే ఇష్టం
ఆమె చెవులకు అమరినదుద్దులంటే  ఇష్టం
ఆమె ముక్కుని అంటుకున్న ముక్కెర అంటే నా కిష్టం
ఆమె చేతికున్న గోరింటాకు అంటే నా కిష్టం
ఆమె కలువపూలలాంటి కన్నులు అంటే నా కిష్టం
ఆమె ను తాకి నన్నే తాకే చిరుగాలి అంటే నా కిష్టం
ఆమెలో కలిసే నా ధ్యాస  అంటే నా కిష్టం
ఆమె కోసం నాలో ఉరికే  అంటే నా కిష్టం
ఆమె కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ ఉండిపోవడమంటే నా కిష్టం
ఆమె పెదవులు పలికే నా పేరంటే నా కిష్టం
ఆమె చిరుదరహాసం అంటే నా కిష్టం
ఆమె కొంటె చూపంటే నా కిష్టం
మల్లెల లాంటి ఆమె మనసంటే నా కిష్టం
తేనెల లాంటి ఆమె మాట అంటే నా కిష్టం
ఆమె పరిచయం నాకు చాలా ఇష్టం
ఆమెనే పరిచయం చేసిన ఆ సమయం అంటే నా కిష్టం
ఆమె జ్ఞాపకాలను నాలో నిలిపివేసే ఈ కాలం అంటే నా కిష్టం
వయ్యారాలను వలకపోసే ఆమె వాలుజడ అంటే నాకిష్టం
ఆ వాలు జడలో అలంకరించబడిన  మల్లెలంటే నాకిష్టం
ఆమెకోసం ఆలోచన
ఆమెకోసం సంబాషణ
ఆమెకోసం అభివర్ణన  
ఆమెకోసం నా అణువణువున 
ఆమెకోసం నా జీవనసాగరమున
ఆమెకోసం నా ఈ విరహవేదన  
ఆమెకోసం శోధన 
ఆమెకోసం నా ఆరాధన 

అంటే మరీ మరీ ఇష్టం

!!!!!!!!!
గరిమెళ్ళ రాజా







0 comments:

Post a Comment