Monday 7 September 2015

కవిత నెం172:నా గమ్యం

30.05.2006
కవిత నెం :172

నేస్తమా నీ ఒక నీడ 
అది ఒక తెలియని జాడ
స్నేహమగునా ఈ ఎడారి ఓడ .......

రహదారిలో గోదారిలా నా దారిలో చేరావు
నా గుండెకే మార్గం లేక గోడను నిలిపావు.
ఎవ్వరు నువ్వో? ఓ మొగలి పువ్వా
నా ఎద తాకినా తారాజువ్వా
నీ చేలిమన్నది చేరువ లేదు
చెరగని ఏ అక్షరం కాదు.
శిదిలమయ్యేది స్నేహం కాదు
శిల లాగ నను చేసినావు.
మబ్బు ఐనా కరిగి వాననిస్తుంది
మన చెలిమికి నాంది నీ మన్నన ఏమయింది.
ఎవ్వరికి ఉండదా జీవితంలో ఇలాంటి పయనం.
ఎవ్వరిని ఒదలబోదు ''చెలిమి'' అనే ఈ నయనం
నా కేమి బారం ఆగదుగా నా గమ్యం
తెలియనంత మాత్రాన నీ తీరం.

!!!!!!!
గరిమెళ్ళ రాజా

0 comments:

Post a Comment