Monday, 7 September 2015

కవిత నెం174:చెలియా గుర్తోస్తున్నావే


కవిత నెం :174
చెలియా గుర్తోస్తున్నావే 
(13 .07 .2011 )
చెలియా గుర్తోస్తున్నావే
చెలియా చంపెస్తున్నావే
చెలియా జ్వాలనే పుట్టిస్తున్నావే

చెలియా కవ్విస్తున్నావే
చెలియా కలవవుతున్నావే
చెలియా ఎదనే నలిపేస్తున్నావే

నీ అందమే ఆనందమే 
నువ్వెప్పుడూ నా సొంతమే
అంటూ అనిపిస్తూనే ,నన్ను నమ్మిస్తూనే 
ఏదో ఏదో ఏదో ఏదో ఏదేదో చేస్తున్నావే

నీ నవ్వులే చిరుజల్లులై
నీ చూపులే నన్ను తడిపేనులే
ఏ చోటకి నే వెళ్తున్నా - ఆ చోటే నువ్వు ఎదురయ్యేనా
నను నేను అద్దంలో చూస్తున్నా 
నాలోనే నువ్వే ఉంటున్నా
ఎంత మత్తుగా ఉంది చెలి ఆ పరిమళం
ఏంటో చిత్తూ చేస్తుంది చెలి ఈ దూరం.

!!!!!!!
గరిమెళ్ళ రాజా


Related Posts:

  • కవిత నెం 184:నువ్వంటే ఇష్టం కవిత నెం :184 *నువ్వంటే ఇష్టం * స్వచ్చమైన నీ చిరునవ్వంటే  నా కిష్టం  వెన్నెలమ్మ హాయిని చూపే నీ చూపంటే నా కిష్టం లోకం మరచి,నీతో ఉండి ,… Read More
  • కవిత నెం188:గురువారం కవిత నెం :188 గురువారం  గురువారం  గురు బలం ఉన్న వారం  శ్రీ సాయి కాటాక్షం పొందే వారం  ఇది లక్ష్మీ వారం  లక్ష్య సిద్ది కలిగ… Read More
  • కవిత నెం191:అల్ప సంతోషి కవిత నెం :191 *అల్ప సంతోషి  * ప్రపంచం చాలా పెద్దది  దానిలో మన ఆలోచనలు అనంతం  అంతా మనమే అనుకుంటూ ఉంటాం  కాని మనల్ని బొమ్మగా చేసి ఆ… Read More
  • కవిత నెం 186:వినాయకుడు - గణ నాయకుడు కవిత నెం :186 వినాయకుడు - గణ నాయకుడు సమస్త పూజలను ముందు అందుకునేవాడుసప్త సముద్రాలు దాటి వస్తున్నాడుదేవుళ్ళందరిలో ప్రధమ ఆరాధ్యడు ముల్లోకాలను చు… Read More
  • కవిత నెం185:చెలియా నీవే కవిత నెం :185 చెలియా నీవే న కన్నుల్లో నీవే న గుండెల్లో నీవే నాతో వచ్చే నీడలో కూడా నేవే ఎటు చూసిన నీవే ఎవ్వరిలో వున్నా ఎదురుగ వచ్చేది నీవే న… Read More

0 comments:

Post a Comment