Monday 7 September 2015

కవిత నెం 171(ప్రేమా ఏదమ్మా నీ చిరునామా)


కవిత నెం :171
ప్రేమా ఏదమ్మా నీ చిరునామా

ప్రేమా ఏదమ్మా నీ చిరునామా
రెండు మనసులు కలుసుకుంటే
వాటి యొక్క కలలు - వెన్నెల కాంతులు
కానీ నీవు మిగిల్చేది - వెన్నెల్లో నీడలు
సముద్రంలోని అలలు ఎగసిపడతాయి
కానీ అవి ఆకాశాన్ని అందుకోలేవు.
ప్రేమికులు గాలిలో మేడలు కడతారు
కాని గాలిలో ఏ మేడైనా నిలువటం అసాద్యం కదా !
అవి సాధ్యమైతే ప్రేమికుల గమ్యానికి గండం ఏముంటుంది.
పగటికలల్లోనే పదహారేళ్ళ జీవితానికి పునాది కట్టిస్తావు
తీరా అది నిజం కాబోతుంటే నిరాశ , నిట్టూర్పు మిగులుస్తావు.
ప్రేమించటానికి మనసు ఉండాలంటారు
కాని ఆ ప్రేమ దక్కకపోతే తట్టుకోవటానికి మనసు కావాలి సుమా!
నీ వేటలో లోకాన్ని మర్చిపోతారు
స్వర్గంలో విహరిస్తున్నంత ఆనందిస్తారు.
కాని ఆ స్వర్గం కింద పాతాళం కూడా ఉంటుందని pasigattaru
ఆ పాతాళంలో పడ్డాక ప్రాణాలని సైతం లెక్కచెయ్యకుండా నీకై పోరాడతారు
అయినా నీ జాడ తెలియ నీవు, అలా ఎందుకు కావాలి.
నేడు వస్తావు .కలతలం సృస్టిస్తావు
మరి నిన్న ,మొన్న వాళ్ళని పెంచి పోషించిన వాళ్ళ పరిస్థితి ఏమిటి ?
కన్నా వాళ్ళ ప్రేమలో లేనిది - నీ మాయలో ఉన్నది ఏమిటి ?
పోనీ ఆ రెంటిని తృప్తి పరచవచ్చుగా అంటే అలా చేయవు
అలా చేస్తే నీ గొప్పతనం తెలియదు కదా
అదే ఏమిటంటే ఈ విదంగా లేకపోతె సృష్టి ఎలా నడుస్తుంది అంటావు.

!!!!!!!!
గరిమెళ్ళ రాజా






0 comments:

Post a Comment