Monday 7 September 2015

కవిత నెం 175:తెలుసా ?

కవిత నెం :175
తెలుసా ?
(27 .07 .11)

మౌనంగా ఎగిరే ఆ పక్షుల బాష తెలుసా !
ఒక దిక్కుకై నిలిచే ఆ పువ్వుల శ్వాస తెలుసా!
నేనంటూ నడిచే - నా పయనం ఎటో తెలుసా !
నువ్వేనంటూ తలిచే - నా ఊపిరి సాగెను తెలుసా !

నువ్వే చెంతన ఉంటె - ఆ పొంతన తెలియదు తెలుసా !
నువ్వే విరహము అయితే - ఆ వేదన బరువు తెలుసా !
నీ కన్నా మించే ఆనందం లేదని తెలుసా!
నీ చిన్న చూపుతో అది పోతుందని తెలుసా!

నీతోటి ఉండగా - నా తుంటరి పనులు తెలుసా!
నీ ద్యాసలో ఉంటూనే - నా ఒంటరి బ్రతుకు తెలుసా!
"నువ్వే నా ప్రాణం" అనే అనుకున్న మాటలు తెలుసా!
నీతో రాలేని ఈ జీవం ఏమవుతుందో తెలుసా!

చేయి చేయి కలిపినా - మన సంగతులన్నీ తెలుసా!
మరో చెయ్యిని తాకి - నాకు సంకెళ్ళు వేసావు తెలుసా!
నా పిలుపు కోసం నువ్వు ఏంటో పిచ్చిగా చేసావు తెలుసా!
నీ పిలుపుల కోసం - నే పడే తాపత్రయము తెలుసా!

నా మాట వినకుండా నీకు రోజూ గడవదని చెప్పేదానివి తెలుసా!
మన కబుర్లు లేని కాలంలో - వుంటున్నామో తెలుసా!
"నిన్ను చూడాలనిపిస్తుంది రా " అంటూ రోజూ అడిగేదానివి తెలుసా!
ప్రతీ క్షణం అక్షరంలా నా ''మేఘ సందేశం'' తెలుసా!

నీవు నిదురించే వేళలో - నాకెన్ని రాత్రులున్నాయో తెలుసా!
నీకు మొదలైన ప్రశాంతత - నాకు దూరం అవుతుందని తెలుసా!

!!!!!!!
గరిమెళ్ళ రాజా


0 comments:

Post a Comment