Monday, 7 September 2015

కవిత నెం180:నీవే కదా

కవిత నెం :180

నా చుట్టూ ఉన్నది నీవే కదా
నా మనసులో ఉన్నది నీవే కదా
నా రూపం నీవే కదా
ప్రతి రూపం నీవే కదా
నా శ్వాశలో ఊపిరి నీవే కదా
నా నీడలో నిజమూ నీవే కదా
నాకు సాక్ష్యం నీవే కదా
ప్రతి పక్షం నీవే కదా

కథలాంటి కధ  కాదు
కన్నీళ్లకి  అది చేదు
మిగిలున్నా నీ తోడు
ఓ మరుమల్లె ఇటు చూడు

నిలువని  నిముషంలో ,సగమై నిలిచున్నా
కదిలే కాలంలో, కలమై సాగుతున్నా
మేఘాలలో మాయవు నీవా?
మెరిసే ముత్యపు పువ్వా
జాజికళ్ల  జామురాతిరి 
జగడమాడే నిన్ను చూడనీ
గాలికి చిక్కని గంధమా
పరిమళాలకు బంధమా

!!!!!!!
గరిమెళ్ళ రాజా




Related Posts:

  • కవిత నెం69:నా చెలికత్తె కవిత నెం :69 నా చెలికత్తె  ********************** నా జతవు నీవు ,నా చెలికత్తెవు నీవు  నా తనువు నీవు ,నా తారామణి నీవు  నా ఎదపై వాలిన ప… Read More
  • కవిత నెం68:నీవుంటే చాలు .. నీకై నేనుంటాను కవిత నెం :68 నీవుంటే చాలు .. నీకై నేనుంటాను  *************************** నిన్ను తలుచుకుంటే చాలు  ప్రేమ సుగంధాలు వీస్తున్నాయి  నీవు నా… Read More
  • కవిత నెం71:వెన్నెలమ్మ ఒడిలో కవిత నెం :71 వెన్నెలమ్మ ఒడిలో *********************************** జామురాత్రి  నీడలో ,జాబిలమ్మ జోలలతో వెండిమబ్బుల కాంతులలో ,నీలిరంగు వెన్నెలలో ఆ… Read More
  • కవిత నెం72:బాల్యం కవిత నెం :72 బాల్యం అందమైన బాల్యం - అది అందరికీ అమూల్యం మధురమైన బాల్యం - అది తిరిగిరాని కాలం మరువలేని జ్ఞాపకం - ఒక తీపి సంతకం అనుభూతుల పుస్తకం - అరు… Read More
  • కవిత నెం70:అంత్యాక్షరి కవిత నెం :70 అంత్యాక్షరి  *************************** అందరినీ అలరించే సరిగమ లహరి  మెదడుకు పదునుపెట్టే సంగీత కచేరి గాత్రాలకు పని చెప్పే గా… Read More

0 comments:

Post a Comment