Monday 7 September 2015

కవిత నెం170:వెన్నెల

కవిత నెం :168

వెన్నెల వెన్నెల.... విరిసే ఓ వెన్నెల

వెన్నెల వెన్నెల.... విరిసే ఓ వెన్నెల
నీ యొక్క సుమధుర కాంతులతో
నా యదలో వెలుగు బాట పరిచిన వెన్నెల

నీవు,
వెండితెరపై నుంచి బొమ్మలా,
సముద్రంలోనుంచి కెరటంలా
జడివానలో నుంచి చినుకులా,
మేఘాలలో నుంచి మెరుపులా,
నదిలో నుంచి కదిలే అలలా 
సూర్యుని నుంచి కిరణంలా,
ఆకాశంలో నుంచి తారలా,
చేరావే  నన్నిలా,
మరపించావే నన్నిలా

వెన్నెల వెన్నెల .......ఓ వెన్నెల

నీవై,

నా గొంతులో గానం నీవై,
నా రూపంలో ప్రతిరూపం నీవై,
నా శ్వాసలో ఊపిరి నీవై
నా నడకలో ప్రతి అడుగు నీవై,
నా శరీరంలో ప్రతి రక్తపుబొట్టు నీవై,
నే త్రాగే నీటిలో హిమబింధువు నీవై,
నా గుండె చేసే సవ్వడి నీవై,
నా ఎదమాటున వెలసిన కోవెల నీవై

నిలిచావే వెన్నెల
మరపించావే నన్నిలా

వెన్నెల వెన్నెల .......ఓ వెన్నెల

!!!!!!!
గరిమెళ్ళ రాజా


0 comments:

Post a Comment