Monday, 7 September 2015

కవిత నెం 173: నీ ప్రేమ కావాలి


కవిత నెం :173
నీ ప్రేమ కావాలి.
(05 .07.11)

ప్రేమ కావాలి - ప్రియా నీ ప్రేమ కావాలి

నన్నే కళ్ళల్లో దాచుకునే - నీ ప్రేమ కావాలి.
నన్నే నీ పెదవులపై నిలిపే - నీ ప్రేమ కావాలి.
నీ గుండెల సవ్వడి చూపే - నీ ప్రేమ కావాలి.
నీ మనసుని హత్తుకునే  - నీ ప్రేమ కావాలి.

నీలో నేనే నిలిచే - నీ ప్రేమ కావాలి.
నీలో సగమై నిలిచే - నీ ప్రేమ కావాలి.

స్వచ్చమైన వెన్న లాంటి - నీ ప్రేమ కావాలి.
వెన్నెల లాగా హాయి నిచ్చే  - నీ ప్రేమ కావాలి.
వర్షం లాగా బాధను చూపే - నీ ప్రేమ కావాలి.
వేకువలాగా పలకరించే - నీ ప్రేమ కావాలి.
చిరుగాలిలా సృచించే - నీ ప్రేమ కావాలి.
నా నీడలాగా నాతో ఉండే - నీ ప్రేమ కావాలి.
గంగానది లాగా పవిత్రమైనా - నీ ప్రేమ కావాలి.
కోవెలలోని దీపంలా - నీ ప్రేమ కావాలి.
అమ్మ ఒడిలాంటి అప్యాయతవున్న - నీ ప్రేమ కావాలి.
నా కన్నీరుని తుడిచేల - నీ ప్రేమ కావాలి.
నా ఆనందం పంచుకునేల - నీ ప్రేమ కావాలి.
నా ప్రతి కదలికలను గమనించే - నీ ప్రేమ కావాలి.
నా ప్రతి రూపం నీవేలాంటి - నీ ప్రేమ కావాలి.
నీ కళ్ళతోనే లోకాన్ని చూపే - నీ ప్రేమ కావాలి.
నీ చేతితో , నా చెయ్యి పట్టుకుని నేనున్నానంటూ తెలిపే - నీ ప్రేమ కావాలి.
నేను నే కోసమే ఉన్నాననే - నీ ప్రేమ కావాలి.
నీ ప్రతి శ్వాస నేనేననే - నీ ప్రేమ కావాలి.
నేనేరా నీ నేస్తమేప్పుడూ అనే - నీ ప్రేమ కావాలి.
నేనేరా నీ సర్వస్వం అనే - నీ ప్రేమ కావాలి.
నేను లేనిదే నీవు  ఉండలేవనీ - నీ ప్రేమ కావాలి.

గరిమెళ్ళ రాజా
!!@!!

Related Posts:

  • కవిత సంఖ్య : 280* హేవిళంబి ఉగాది శుభాకాంక్షలు * కవిత సంఖ్య : 280 * హేవిళంబి ఉగాది శుభాకాంక్షలు * మావి కొమ్మలు మల్లె రెమ్మలు కోయిలమ్మలు లేలేత చిగురులు వేప పువ్వులు చెఱుకు గడలు బంతి- చేమంతులు పుడమ… Read More
  • కవిత నెం : 282(శ్రీ రామ్ ) కవిత నెం : 282 *శ్రీ రామ్ * రామనామము రమనీయమైన కావ్యంరామనామజపం ముక్తికి మోక్షదాయకంమానవజాతికే ఆధర్సనీయం శ్రీరామజన్మంజయహో జయరామ పరందామ శ్రీరామ జయహే ! … Read More
  • కవిత సంఖ్య :279 (వస్తుంది ఉగాది !) కవిత సంఖ్య :279 కవితా శీర్షిక : వస్తుంది ఉగాది ! తెలుగింటి ముంగిలి లోకి  ఇష్టం పెంచుకుని మరీ వస్తుంది ఉగాది  స్వచ్ఛమైన మనసులకు ఆహ్లాదం అ… Read More
  • కవిత నెం :18 //ఉగాది // కవిత నెం :18 //ఉగాది // వసంతకాలాన విరబూసే చైత్ర మాస సోయగం ''ఉగాది'' ప్రకృతిని పులకరింపచేసే  చైత్ర శుద్ధ పాడ్యమి ''ఉగాది '' మనసుని పలకరించే మళ… Read More
  • కవిత నెం 278: అంతా మిధ్య కవిత నెం :278 * అంతా మిధ్య * ఎక్కువగా ఏదీ కోరుకోకు  పొందినదాన్ని చేతులారా చేజార్చుకోకు  అంతా నీదేనని మిధ్యపడకు  ఇంతలో ఏముందని తేలికప… Read More

0 comments:

Post a Comment