Monday 7 September 2015

కవిత నెం178:హాయ్ - హలో

కవిత నెం :178

హాయ్ ; హలో 

సముద్రమంతా ఎంత సరదాగా విహరిస్తుందో 
ఆకాశమంతా  ఎంత నిర్మలంగా వికసిస్తుందో 
అలాగే నా మనసు నీతో సరదాగా తిరగాలని 
మాట్లాడాలని సరదాపడుతుంది సముద్రం లాగా
నీ ఒడిలో నా తలపెట్టి నిద్రిస్తుంటే 
నీ నిర్మలమైన హృదయంలో అన్ని బాధలు మర్చిపోయి 
నీ ఒడిలో ఒదిగిపోవాలని వుంది - మేఘాలలోని చంద్రుడిలా 
కానీ నీవేమో వాగులాగా కొండలోతుల్లోనుంచి 
కొండల మీద నుంచి జారిపోతున్నావు.
నీవేమో చేపవి కాదు - జాలరిలాగా వలవేయటానికి 
నీవు ఒక పక్షివి కాదు - పంజరంలో బంధించటానికి 
పట్టుకుంటే పాములాగా పారిపోతున్నావు.
ముట్టుకుంటే మెరుపులా మాయమవుతున్నావు.
నీ స్వేచ్చ నీది, నీ ఆనందం నీది,
నీ ఉల్లాసం - ఉత్సాహం నీవి.
వాటితో నేను కూడా  చెయ్యి కలపాలనుకుంటే 
ఎందుకు నువ్వు కాదంటు వున్నావో తెలియటంలేదు.
నన్ను కాలరాసి కొండలలో ఎగురుతున్నావు.
కానీ ఒకటి గుర్తుంచుకో 
నువ్వేగిరి కొండలు ఎవరో కాదు
అవి నేనే ప్రియా!

!!!!!!!
గరిమెళ్ళ రాజా

0 comments:

Post a Comment