Thursday, 27 October 2016

కవిత నెం 231:ఆర్టీసీ బస్సు

కవిత నెం :231

* ఆర్టీసీ బస్సు *

ఆర్టీసీ బస్సు ఓ ఆర్టీసీ బస్సు
మీది మీదికొస్తావు ఆర్టీసీ బస్సు
ఆర్టీసీ బస్సు ఓ ఆర్టీసీ బస్సు
రోడ్డు మొత్తం తిరుగుతావు ఆర్టీసీ బస్సు
ఎందుకలా చేస్తావు ఆర్టీసీ బస్సు
ఎగిరెగిరి పోతావు ఆర్టీసీ బస్సు
ఏమంతా దర్జా నీది ఆర్టీసీ బస్సు
వెనక ముందు చూడవు ఆర్టీసీ బస్సు


పేరుకేమో నువ్వు  ఆర్టీసి బస్సు
నియమాలు పాటించవు ఆర్టీసీ బస్సు
నీకోసం ఉంటుంది చక్కటి దారి
నీకోసమే వేచింది బస్ షెల్టరు మరి
ఆగమంటే ఆగవు ఆపించే చోట
అడ్డంగా పోతావు రోడ్డు జామున్న చోట

ఎందుకలా చేస్తావు ఆర్టీసీ బస్సు
నీ ముందు వాహనాలే తుస్సు తుస్సు
ఏమంతా దానివే ఆర్టీసీ బస్సు
నీకెవరైనా ఎదురైతే కస్సు బస్సు

వద్దంటావు ప్రెవేటు ప్రయాణం
భద్రతంటావు ఆర్టీసీ ప్రయాణం
నీ ధరలేమో మా నెత్తిన భారం
పండగలు ,పబ్బాలకు నీతో వెళ్లలేం
ఏమంతా వసతులు ,పేరుకే చెప్తరు
తీరా ఎక్కినాక సర్దుకోమంటరు

మరి ఏమంటావు ఆర్టీసీ బస్సు
పై పై కే  నీ మెరుగులు ఆర్టీసీ బస్సు
ఏం చేస్తాము మరి ఆర్టీసీ బస్సు
నీకు టాటానే చెప్పాలి ఆర్టీసీ బస్సు









Related Posts:

  • కవిత నెం41(ఆకాశం) కవిత నెం :41// ఆకాశం // ఆకాశం ............................. చిన్న పిల్లలకైనా ,పెద్ద వాళ్ళకైనా ఆకాశమంటే ఆహ్లాదకరమైన ఓ ఆట విడుపు భాదలో ఉన్నా , ఆనందం… Read More
  • కవిత నెం29(నీ ఓటే ఒక ఆయుధం) కవిత నెం :29 ***నీ ఓటే ఒక ఆయుధం*** చతికిలపడ్డ సమైక్యత ను నిద్ర లేపటానికి అలసిపోయిన ప్రజాస్వామ్యాన్ని కదపటానికి నీ ఓటే ఒక ఆయుధం  //2// నీ గుండ… Read More
  • కవిత నెం44(దేవుడా ....... నీవెక్కడా ) కవిత నెం :44  దేవుడా ....... నీవెక్కడా  ************************* అందకుండా ఉండువాడా దేవుడా అందరి నమ్మకం అయ్యినవాడా దేవుడా ఏడ నీవు దాగున్నావ… Read More
  • కవిత నెం62(భూమి పుత్రుడు ) కవిత నెం :62 భూమి పుత్రుడు  ******************************************* ఆరుకాలాలలో అన్నం పెట్టగలిగేది ఒక్క రైతు మాత్రమే  నేడు అందరి అవసరా… Read More
  • కవిత నెం37(తొలకరి జల్లు) కవిత నెం : 37 తొలకరి జల్లుల తిమ్మిరితనం  మేలుకుంటుంది తుంటరితనం ఆడుకుంటుంది చిలిపితనం  అలుపెరుగదు అల్లరితనం  చిన్నపిల్లలకు కేరింతతనం… Read More

0 comments:

Post a Comment