Saturday 8 October 2016

కవిత నెం 230 :కన్నీరు

కవిత నెం : 230

''కన్నీరు ''

కంటి నుండి వచ్చును 'కన్నీరు' 
మనసు చెమ్మగిల్లితే ఆ భాదే నీరు 

ఉప్పొంగే దుః ఖమే 'కన్నీరు '
ఉప్పెనగా మారితే అది ఏమవును ,ఏమవును ?

ఆడువారిలో  ఇది అగ్రస్థానము 
ప్రతి సున్నితమైన మనస్సులో ఇది సుకుమారము 

సంతోషమైనా ,ప్రేమైనా చలించిపోవును 
మన రెండు కళ్లనూ తడిమి తడిమి తోడువచ్చును 

గుండెలోన భాదకు ఓదార్పు 'కన్నీరు' 
ఆత్మీయంగా హత్తుకునే స్పర్శ  'కన్నీరు'

భారాన్ని కరిగించే ఆయుధం 'కన్నీరు'
 బాధలను చెరిపి మనసుని తేలిక చేసే  'కన్నీరు '

 పొరపాటుని దిద్దే బెత్తం ఈ 'కన్నీరు '
బంధాల్ని నిలిపే జలధార ఈ 'కన్నీరు '

- 08. 10. 16 //గరిమెళ్ళ గమనాలు //



0 comments:

Post a Comment