Monday, 28 April 2014

కవిత నెం27:నా దేవి

కవిత నెం :27

నాలో సగం
నా రూపంలో ప్రతి రూపం
నా భావాలకు అక్షర రూపం
నా కన్నులకు నీవు కార్తీక దీపం
నా మనసుతో ముడిపడిన మరో వసంతం
నా హృదయములో నిలచిన పారిజాతం
నీ పరిచయం ఓ నందనవనం
నిన్ను చేరగా నా జీవితం ఓ బృందావనం
నా కలల రాణివి - పద్మ కుసుమానివి
నా అంతరంగ తలపుల కావ్య రూపానివి
నీ చిరు ధర హాస చినుకుల వర్షం
నన్ను నన్నుగా చూపే జల తరంగం
నీ నయన జతల మద్యన మేలి సోయగం
నా హృదయవాకిలిని వెలిగించే అఖండం
నీవుంటే చాలు చెలీ -నిదురంటూ  వద్దు
నీవున్న చోటనే కదా - అది నాకు ముద్దు
నిన్ను పొందిన నా జీవితం నాకే ఒక వరం
నిన్ను నా కందించగా ఈ కాలం చేసుకుంది పుణ్యం
నిత్య యవ్వనంగా -నిండు వసంతంగా
పండు వెన్నెలవై - జీవించు నూతనంగా
నీ చెంత నేనుంటా -అడుగు ముందుకెయ్యమంటా
అష్ట దేవతలంతా వచ్చి -ఆశీర్వదించగా నిన్ను మెచ్చి
శతకోటి వర్ణాల కాంతులతో 
ఆకాశమంత హరివిల్లుల జిలుగులతో 
పద్మలతలతో పగడపు సొగసులతో 
శ్రీ పద్మమై చిరకాలం జీవించాలని 
అందుకో నా దేవి 
నీకిదే నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు 



Related Posts:

  • కవిత నెం39:మారండి కవిత నెం :39 మనుషుల్లారా మారండి మనుషులమని గుర్తించండి మనకు మనమే బంధువులం మనకు మనమే స్నేహితులం మనకు మనమే ఆత్మీయులం మనకు మనమే శత్రువులం మానవ జన్మ ఒ… Read More
  • కవిత నెం40:బాపు బొమ్మలు కవిత నెం :40 //బాపు బొమ్మలు// ****************************** ఎంత చూసినా తనివి తీరనిది ''బాపు బొమ్మ '' ఎన్ని సార్లు వర్ణించినా మనసు నిండనిది మన '… Read More
  • కవిత నెం38:స్నేహం కవిత నెం :38 స్నేహం చినుకులా వచ్చి వర్షంలా మారి నదిలా ప్రవహించి మన మనసులో నిలచిపోయే అద్బుతమైన బంధం బాష లేని భావ తరంగం ఈ ''స్నేహం '' మరణం లేని అమరం ఈ… Read More
  • కవిత నెం 42:నీ బ్రతుకు -నీ ఉరుకు కవిత నెం :42 నీ బ్రతుకు -నీ ఉరుకు   *********************** ఎవరు  తీర్చగలరు నీ ఇంటి భాదలు ఎవరు మోయగలరు నీ అశ్రుధారలు నడుచుచున్న సమాజమే - … Read More
  • కవిత నెం43:మనసుకి మనో వేదన కవిత నెం : 43 మనసుకి మనో వేదన  *********************** చిన్నారి చిన్నా - చింత వద్దమ్మా  బంగారు కన్నా - భవిత నీదమ్మా  ఆశలన్నీ ఆవిరయిన… Read More

0 comments:

Post a Comment