Monday, 23 January 2017

కవిత నెం257:నేతాజీ నీకు జోహారు

కవిత నెం -257

* నేతాజీ నీకు జోహారు *

స్వాతంత్ర సమరంలో పోరాడిన యోధుడా
వెన్ను వంచక శత్రువుల గుండెల్లో వణుకు పుట్టించిన వీరుడా
జోహార్లు నీకు జోహార్లు

పోరుబాట తో ఉద్యమాన్ని  ముందుకు నడిపిన సమరుడా
ఆంగ్లేయులు నిర్బంధించినా రొమ్ము చూపిన రణధీరుడా
జోహార్లు నీకు జోహార్లు

ధైర్యానికి ,సాహసానికి నిలువెత్త్తు రూపం నీవురా
భారత స్వాతంత్ర సంగ్రామంతో కదిలిన భవదీయుడా
జోహార్లు నీకు జోహార్లు

నీవు నమ్మిన సిద్ధాంతాలతో ఫిరంగులా కదిలావురా
దేశ దేశాలు తిరిగి సైనికులకు వారధిలా నిలిచావురా
జోహార్లు నీకు జోహార్లు

ఉడుకు నెత్తురు ఊఫుతోటి ఉడుములా మారావురా
కలలు కనక ,క్షణం విడువక ఉద్యమాలు నడిపావురా
జోహార్లు నీకు జోహార్లు

అధ్యాకుడుగా , అగ్ర నాయకత్వపు వారసుడా
భరతమాత స్వేచ్ఛ కోసం నిన్నే అర్పించుకున్న అమరుడా
జోహార్లు నీకు జోహార్లు

గగన సీమలో గఘనమైన  ఓ భారతీయుడా
నీ మరణపు రహస్యాలు మిస్టరీగా మారేరా
మా గుండెల్లో చిరస్మరణీయుడా
జోహార్లు నీకు జోహార్లు






Related Posts:

  • మినీ కధ 1 :ఎలుకమ్మ ర్యాగింగ్ మినీ కధ  ** ఎలుకమ్మ ర్యాగింగ్ *** మా ఇంటి అలమరలో ఉంది ఒక ఎలుక  ఎప్పటి నుంచో వేసింది పాగ  దొరకకుండా తిరుగుతుంటాది బాగా  ఓ అల్లరి … Read More
  • కవిత నెం 237: నీ ప్రేమకు సలాం కవిత నెం : 237 * నీ ప్రేమకు  సలాం * నా మనసు మళయమారుతం లా మారింది  నీ ముద్దు మాటల తడి నన్ను చేరగా  నన్ను మార్చాలని ప్రయత్నించి  న… Read More
  • కవిత నెం 233 :చదువుల బరువులు కవిత నెం  :233 *** చదువుల బరువులు **** చిట్టి చిట్టి చేతులకి బారెడు బాధ్యతలు  బుడి బుడి నడకలకి ఈడ్చలేని బ్యాగుల మోతలు  ఏం న… Read More
  • కవిత నెం 235 :నీతోనే ఉంటా నమ్మవా కవిత నెం  :235  * నీతోనే ఉంటా నమ్మవా * నా నిద్రతో నీవు నిదురిస్తున్నావా చెలీ అందుకే నాకు నిద్రలేని ఈ రేయి నా కనురెప్పపై కొలువున్నావా చెలీ … Read More
  • కవిత నెం 236:ప్రేమంటే నా మాట లో కవిత నెం : 236 * ప్రేమంటే నా మాట లో * ప్రేమంటే నిన్ను కోరుకోవటం  కాదు ప్రేమంటే నీ మనసుని కోరుకోవటం ప్రేమంటే నిన్ను వేధించటం కాదు ప్రేమంటే నిన… Read More

0 comments:

Post a Comment