Friday, 27 January 2017

కవిత నెం 262:పిచ్చి మా తల్లి

కవిత నెం :262
*పిచ్చి మా తల్లి *
నువ్వెంత మగాడివి అయినా
ఏదైనా భరించగలిగే శక్తి ఉన్నది ఒక్క  ''స్త్రీ '' మాత్రమే

కానీ తనను , తన ప్రేమను భరించే శక్తి నీకుండాలి
అమ్మ ప్రేమను కలిపి తినిపిస్తుంది
భార్య  తన ప్రేమను , జీవితాన్ని నీతో పంచుకుంటుంది
సోదరి నువ్వు తనకు శ్రీ రామ రక్ష గా భావిస్తుంది

పొరపాటున కూడా నీ విసుగు వారిపై ప్రదర్శించకు
ఎంత ఎదిగినా ,ఎంత బిజీ గా ఉన్నా వారిని చులకన గా చూడకు
తను అలసిన వేళ ,సుకుమారంగా చూసుకో
తను విసిగిన వేళ , నీ ఔదార్యం చూపించుకో
నీ ఒత్తిడిని తనతో  పంచుకో నీకు ఊరట లభిస్తుంది
నీ ప్రేమ ప్రదర్శన కాదు తనకి అది భరోసా కావాలి
విలువను ఆశించకు ... ఎందుకంటే తను అవి కోరుకోదు
మేడలు ,మిద్దెలు కట్టి ఇవ్వాల్సిన అవసరం లేదు
నీ చెంత ఉంటే నువ్వే ప్రపంచం అనేలా చూసుకో
తన భాద పడే సమయం కూడా లేకుండా చూడు
నీ భాదను తన గుండెల్లో దాచుకుంటుంది కాబట్టి
నీ సంతోషంలో తన ఆశలను చూసుకుంటుంది
నీ కుటుంబంలో తన బంధాలను కలుపుకుంటుంది
నిన్ను నమ్మి , దూర భారాలను దాటి వస్తుంది
తన తాళి బరువు అని ఎప్పుడూ భావించదు
తన మాంగళ్యమే తన బలం అనుకునే  పిచ్చి మా తల్లి

- గరిమెళ్ళ గమనాలు
(28. 01. 2017)



Related Posts:

  • మాయ మనిషి(356)శీర్షిక :మాయ మనిషినిజంగా మేడిపండు ఫలమే కాదుమన జీవితానికి ఉదాహరణగా నిలచే రాశిఫలంఎందుకో ఎత్త ఎత్తుకి ఎదుగుతున్న మనిషితన బుద్ధిలో మాత్రం మందగిస్తూనే ఉంటా… Read More
  • ఓ ఓటరు మహాశయా! (350)కవితా శీర్షిక : ఓ ఓటరు మహాశయా!మన పోరాటం వ్యవస్థ కోసం కాని ఒక వ్యక్తి కోసం కాకూడదు.మన ఆరాటం చెడుని జయించటం కోసంకాని మంచిని ముంచటం కోసం కాకూడదు.మన … Read More
  • నీవేమి -నేనేమి (8) // నీవేమి -నేనేమి // నిన్ను చూడక నా మది గది తలుపును తెరువకున్నదే నీవు నాతోన లేని ఈ క్షణమున నా నయనం ఏ దృశ్యమును చూడలేకున్నదే ఎందుకు ఎందుకు ఎందులకు ? న… Read More
  • నిన్ను నిన్నుగానే ప్రేమించా(11) ''నిన్ను నిన్నుగానే ప్రేమించా'' నిన్ను నిన్నుగానే ప్రేమించా నీకోసం నిరీక్షించా ,పరితపించా నా జీవితంలో ఇక నీవే నా పట్టపురాణివి నీ  పలుకుల  … Read More
  • ఐ లవ్ యు ప్రియా (7) కవిత నెం : 7ఈ సముద్రం సాక్షిగా నింగి సాక్షిగా ,నీరు సాక్షిగా  నేను నిన్ను ప్రేమిస్తున్నా ప్రియా  సముద్రం ఎన్నో జీవరాసులను  తనలో దా… Read More

0 comments:

Post a Comment