Wednesday, 18 January 2017

కవిత నెం 255 : పల్లెటూరు పిలుస్తోంది (పార్ట్ -1)

కవిత నెం :255

** పల్లెటూరు పిలుస్తోంది (పార్ట్ -1) **

కొక్కొరొక్కో అంటూ నిద్రలెమ్మని చెప్పే కోడి
ఆతృతగా పాలు కుడుస్తూ ఆకలి తీర్చుకునే లేగదూడ
అమ్మా పాలు , అయ్యా పాలు అంటూ చీకటివీడకుండా వచ్చే పాలవాడు
అంబా అంటూ పోగేసిన మెత్తని గడ్డిని నెమరేసే మా ఇంటి ఎర్రగేద
దట్టంగా కమ్మేసిన మంచులో పని చేసుకుంటూ పోయే  మా తాత
వేడివేడిగా పాలు పితికి అందరికీ టీ అందించే మా అమ్మమ్మ
పేడ కలిపిన నీళ్ళతో కల్లాపు చిమ్మగా ఒళ్లు విరుచుకునే మా ఇంటి వాకిలి
ముగ్గుల చుక్కల అల్లికలతో ముస్తాబు చేసుకునే మా ముంగిలి
కొబ్బరి ఆకులను చీల్చుకుని మా ఇంటి సూరిని తాకే సూర్య కిరణాలు
ఏరు గట్టు నుంచి పోతుంతే కనిపించే నగ్న సత్యాలు
వడ్లు దాచుకొనుటకు నిర్మించే వరి తాడు గానుగలు
గోడలకు సున్నం అవసరం లేకుండా అంటుకునుండే పిడకలు
ఇంటి పెరట్లోనే విరిసే కుసుమాలు , కాసే కూరగాయలు
కట్టెలపొయ్యిపై కాసే  వేడి నీటి ఆవిర్లు , వంటల ఘుమఘుమలు
పండగంటూ వస్తుంటే మట్టి -పేడతో మందంగా తయారయ్యే మా ఇంటి గచ్చు
వండుకున్నది ప్రేమగా  తెలిసిన వారందరికీ పంచి బెట్టుకునే సాంప్రదాయాలు
ఎడ్ల బండిపై  సవారీలు -  యేరు దాటేందుకు తాటి మొత్త వంతెనలు
ట్రాక్టరుతో కుటుంబ సమేతపు తిరునాళ్లు - మట్టి రోడ్ల నేర్పే వయ్యారపు నడకలు
వాన కురిసే ముందు మట్టి నేల వెదజిమ్మే సువాసనలు
పచ్చని చేలలో పైరుగాలి చేసే గల గల సవ్వడులు 
కొబ్బరాకు పందిళ్లు - అరటి చెట్లతో అందాలు - మామిడాకుల తోరణాలు 
చిలకల పలుకులు -కోకిల గానాలు - ఊరి గుడిలో చేసే కల్యాణాలు 
అబ్బురపరిచే కోలాటాలు - చేతి కర్రలతో విన్యాసాలు 
ఒకరికి బాధ వచ్చినా , కష్టం వచ్చినా ఊరు మొత్తం ఏకమయ్యే సంఘటనలు
చెమటలు చిందించి మమతను పంచుకునే ఇరుగుపొరుగు మనుషులు
సాయంత్రం కాగానే  సందడితో నిండి పోయే మా వీధి చివరి అరుగు
డబ్బు జబ్బు లేకుండా పాడి పంటలతో హాయిగా బ్రతికే రైతన్నలు
ఆరోగ్యం పల్లె జీవనం - అనురాగం పల్లె సోయగం 












Related Posts:

  • కవిత నెం90:happy new year కవిత నెం :90 అందరికీ అభివందనం ఆహ్వానాల నీరాజనం పల్లవి : హిమాలయమంత  మనస్సుతో - happy new year  నయాగరా ఉషస్సులా - happy new year ఎవరైనా ఎప్… Read More
  • కవిత నెం91:ATM కవిత నెం :91 ATM ఓయ్ నేనే అంటే నీకు తెలుసా ? తెలియదు ఎందుకు తెలుస్తుంది నా పేరు ATM ALL TIME MONEY అని నన్ను పిలుస్తారు అవసరమైన టైం లో ఆకస్మాత… Read More
  • కవిత నెం94:చదువు కవిత నెం :94 చదువు  రచన : 19 , హైదరాబాద్  అ, ఆ, ఇ, ఈ ల చదువు  అమ్మ , నాన్నల పదాలకే చదువు  ఆరు బయట చదువులు  వీడ… Read More
  • కవిత నెం93:ఎక్కడ ఉందొ ఆ జాభిలమ్మ కవిత నెం :93 కవిత పేరు    : ఎక్కడ ఉందొ ఆ జాభిలమ్మ రచన           : రాజేంద్ర ప్రసాదు … Read More
  • కవిత నెం96:మల్లె పువ్వు కవిత నెం :96 //మల్లె పువ్వు // *మల్లె పువ్వు * రచన : 13 ,హైదరాబాద్ ఇది మనసుని దోచే పువ్వు ఇది మనసుకి హత్తుకునే పువ్వు ఇది మన ఊసుల్ని కదిలిం… Read More

0 comments:

Post a Comment