Sunday, 17 December 2017

కవిత నెం :312(ప్రపంచ తెలుగు మహాసభలు)

కవిత నెం :312
* ప్రపంచ తెలుగు మహాసభలు *

అత్యంత రంగ వైభవంగా
ప్రతీ ఇంట కవుల సంబురంగా
తెలంగాణా తెలుగు వెలుగులు అంబరంగా
అందరికీ ఉత్తర్వ / రిజిష్టర్ ఆహ్వానాలు
సుదూర ప్రాంతాల నుంచి చేరిన కవికిరణాలు
ఎందరో కళాకారుల ప్రతిభకు ఇదొక ఆనవాళ్లు
హైదరాబాద్ నడిబొడ్డున తెలుగు శోభితాలు
తలచిన కార్యం ఒక మహా సాహితీ ప్రభంజనం
ఎందరో కవుల /కళాకారుల హృదయాల పులకరింత
ఎందరో ప్రేక్షకుల నయనాలు  పరవశింత
ఆత్మీయం ,ఆతిధ్యం హత్తుకొంటూ
ఆకాశపందిరి , హరివిల్లు ఒకటిగా కలుసుకుంటూ
పొందివచ్చిన అవకాశం అందిన ద్రాక్షగా
అందకుండా జారిన అవకాశం ఒక ఆశగా
అతిదులందరున్నా , సమావేశాలు ఎన్నున్నా
ప్రాచుర్యం , ప్రావీణ్యత కనపరచే వేడుకగా
తెలంగాణా విశిష్టత నలుదిశలా ప్రవహించగా
సాగింది ఈ ప్రపంచ తెలుగు మహా సభ
ప్రతి తెలుగోడి మదిలో నిలచిన మహా సభ

ఎన్నో రాష్ట్రాల సమ్మేళనం మిళితమైన వేళ
ఎన్నో భాషల పయనం తీరం చేరిన వేళ
అవమానాలు , ఆలస్యాలు ఎదురైనా
అభిమానం ముందుకు సాగమని చెప్పెనుగా
రాజకీయాల కూటమైనా , రాజసం ఒక బాటగా
సత్కారం , సన్మానం రుచి చూపుతున్నా
ప్రతిభ తగ్గలేదు , గౌరవం వీడలేదు
ఇవి పొందిన వాడు ధన్యుడు
పొందలేనివాడుగా ఉన్న సామాన్యుడు

కొన్ని లొల్లి రేగుతూ , సర్దుమణుగుతూ
చీకటిని చీల్చుకుంటూ , వెలుతురుని వెతుక్కొంటూ
మంచి వారికి మంచి అవకాశ రధం
కొంతైనా ముందుకుపోతుంది తెలుగోడి పదం
కవుల గళాలన్నీ కలిసి అయ్యింది జనపధం

సమన్వయ లోపాలు సహజం
నిర్వాహకుల కృషి అభినందనీయం
కానీ అవసరం ప్రతి ఒక్కరికి సంయమనం
ముఖ్యంగా రక్షణ వ్యవస్థ యొక్క తోడ్పాటు
ప్రభుత్వ యంత్రా0గం సాధించింది విజయం
హర్షణీయం .... తెలుగు వెలుగుతుందని
ఇటువంటి సాహితీ పోషణకు శ్రీకారమయ్యిందని

- గరిమెళ్ళ రాజేంద్ర ప్రసాదు



Related Posts:

  • కవిత నెం 212:వీడ్కోలు 2015- స్వాగతం 2016 కవిత నెం :212 వీడ్కోలు 2015- స్వాగతం 2016 గతాన్ని విడనాడాలి కాని గత సృతులు కాదు కష్టాల్ని మరువాలి కాని కష్టపడటం కాదు చెడు నుంచి నేర్చుకోవాలి కాని చ… Read More
  • కవిత నెం 203:నిజమైన దీపావళి రావాలనీ ........ కవిత నెం :203 నిజమైన దీపావళి రావాలనీ ........  స్వార్ధానికి బలవుతున్న అనాధలను చూడు  కోడిపిల్లలా మారుతున్న ఆడపిల్లల బ్రతుకు చూడు  వ్యస… Read More
  • కవిత నెం 202:రైలంట రైలు కవిత నెం : 202 రైలంట రైలు దీనికి ఉండదంట వేలా పాలు ఇది తిరుగుతాది ఎన్నో మైళ్లు కూస్తూ ఉంటుంది రైలు బెల్లు  ఆగిన చోట ఉండదు ప్రతీ చోటా ఇది ఆగదు కా… Read More
  • కవిత నెం 208:నేను కవినేనా ? కవిత నెం :208 నేను కవినేనా  నేను కవినేనా  మనసు పెట్టే రాస్తాను  నా కాలానికి పని చెబుతుంటాను  మరి నేను కవినేనా ? అక్షరాలను కలుప… Read More
  • కవిత నెం 210 :ఒక్కడినే కవిత నెం :210 ఒక్కడినే  నాలో నేనే ఒక్కడినే  నాతో నేనే ఒక్కడినే  నా ముందు నేను  నా వెనుక నేను  నా చుట్టూ నేను  నేనంతా … Read More

0 comments:

Post a Comment