Thursday, 25 August 2016

కవిత నెం 224 :విజయవాడ లో -కృష్ణా పుష్కరం

కవిత నెం 224

* విజయవాడ లో -కృష్ణా పుష్కరం  * 

ఇప్పుడిప్పుడే  రూపుదిద్దుకొంటున్న   అమరావతిలో
అందంగా ఆడుకుంటుంది కృష్ణమ్మ 
ప్రతీ 12 సం //ల తర్వాత తన వద్దకు వచ్చే పుష్కరునితో 
తండోపతండాలుగా వచ్చిన జన సంద్రాన్ని చూసి 
పులకిస్తూ ,పలకరిస్తూ ప్రవహించ సాగింది మన కృష్ణమ్మ 

చుట్టపు చూపుగా వచ్చి మన గంగమ్మ కూడా జత కలవడంతో 

బిర బిరా మంటూ ,కిల కిల రావాలు చేస్తూ పరవశించింది కృష్ణమ్మ  
వడి వడిగా పరిగెత్తుతూ , తన హొయలతో ఆకర్షిస్తుంది కృష్ణమ్మ 
వచ్చిన అవకాశాన్ని  సద్విని యోగం చేసుకోమంది కృష్ణమ్మ  

నగరమంతా మిల మిలా మెరిసిపోయింది 

వీధి వీధుల్లో పుష్కరాల జాతర సాగింది 
ఎటు చూసినా కొత్తదనం ,పాత రూపుల్ని మాపుతూ 
ఎటు చూసినా సందడి , మన కృష్ణమ్మ తీరం వెంబడి 

ఈ 12 రోజులూ ఒక  పెద్ద పండుగ వాతావరణం 

ప్రతి ఇంట కనుల పంట చేసింది ఈ సంబరం 
ఆట పాటలతో ,కేరింతలతో మన కృష్ణమ్మ ఒడి 
దివ్యకాంతులతో ,దేదీప్యంగా మన కనకదుర్గమ్మ గుడి 

ప్రత్యేకంగా అలంకరించ బడిన మన  'ప్రకాశం బ్యారేజి '

ఫెర్రీ-పవిత్ర సంగమం వద్ద ఏర్పాటు చేసిన 'పుష్కర   హారతి' 
దుర్గ గుడి ,తిరుపతి గుడి నమూనాలు దిగి వచ్చిన తరుణం 
వేయి కళ్లు చాలవు కదా , వాటిని వీక్షించగా మన జన్మ పావనం 
నిగ నిగ లాడే రహదారులు - స్వాగతమంటున్న పుష్కరఘాట్లు 

వర్ణించటానికి కూడా  మాటలు చాలవు విజయవాడను చూసి 

వాడ వాడాలా ,వాలంటీర్స్ యొక్క ఆతిధ్యం తో మురిసి 

నిర్విరామంగా సాగిన మన ప్రభుత్వపు సహకారాలు 

అవి మన  చంద్రబాబు చేసిన గొప్ప  మార్గ దర్శికలు

ప్రతీ  ఒక్కరు కదిలొచ్చి -అందించిన  సహాయాలు 

ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే కృష్ణా పుష్కరాలు 
తరతరాలకు ,వీడిపోని కృష్ణమ్మతో మన సంబంధాలు 

హారతి వైభవం - నిత్యా శోభాయమానం మన కృష్ణమ్మ కు 

సకల పాప  హరణం - మన కృష్ణా  పుష్కర స్నానం స్నానం 
పరమ పవిత్రం - పావనం - జనపునీతం -కృష్ణా పుష్కరం 










Related Posts:

  • కవిత నెం257:నేతాజీ నీకు జోహారు కవిత నెం -257 * నేతాజీ నీకు జోహారు * స్వాతంత్ర సమరంలో పోరాడిన యోధుడా వెన్ను వంచక శత్రువుల గుండెల్లో వణుకు పుట్టించిన వీరుడా జోహార్లు నీకు జోహా… Read More
  • కవిత నెం 108:భయం కవిత నెం :108 ఎక్కడ నుంచి వస్తుందీ ? ఎటువైపునుంచి వస్తుందీ ? చల్లని స్పర్సలా వచ్చి  పాదరసంలా ఒళ్ళంతా పాకి  కరెంటు షాక్ లా నరనర మెక… Read More
  • కవిత నెం106:కోపం కవిత నెం :106//కోపం // కోపం కోపం  ఎందుకు రావాలి ఈ కోపం  వచ్చి ఏమి వెలగబెడటానికి  వచ్చి ఏమి సుకార్యం చేయటానికి  కోపం కోపం… Read More
  • కవిత నెం :258 కవిత నెం :258 పసి హృదయంలో ప్రేమని పుట్టించావు ఆశలతో నా మనసుకి నడక నేర్పించావు నీ వలపుల ఊసులతో ఉరకలు వేయించావు అన్నీ చేసి ఇలా ఓడిపొమ్మని నన్నొదిలి వె… Read More
  • కవిత నెం107:మౌనం కవిత నెం :107 //మౌనం // అంతరంగంగా తరంగాలను సృష్టించే ధ్వని ఈ ''మౌనం''  సుముఖంగా భావాలను దాచ గని ఈ ''మౌనం''  సూర్యోదయం రాకముందే తన ఉషస్స… Read More

0 comments:

Post a Comment