Saturday 23 July 2016

కవిత నెం 223: హాయ్ బంగారం

కవిత నెం :223

హాయ్ బంగారం

నీకు నేను గుర్తొస్తున్నానా ?

కాని నాకు మాత్రం నువ్వు గుర్తొస్తూనే ఉంటావు

అనుక్షణం ......... అనునిత్యం ....... నీ జ్ఞాపకాలే
కలలో ...... ఇలలో ...... నీ ఊహలే

ఒంటరితనం అలవాటు పడటం లేదు
నీ తోడు నాకు పరిచయం అయ్యాకా

ఒక్కడిగా మనసుకి సర్ది చెప్పలేకపోతున్నాను
ఇద్దరుగా కలిసి ఒక్కటి అయ్యాకా

నీకు నా ఆలోచన ఉంటుందో లేదో తెలియదు
కాని నా ధ్యాసెప్పుడూ నీకై తపిస్తూ ఉంటది

ఎలా ఉన్నావు ? ఏమి చేస్తున్నావు అనే ప్రశ్నలు
నా నీడలా వెంటాడుతూ నిన్ను గుర్తు చేస్తూ ఉంటాయి

గాలి గుర్తుచేస్తుంది గాల్లో తేలిన సంఘటనలని
వాన చినుకు గుర్తుచేస్తుంది వర్షంలో హర్షించిన సమయాన్ని

సంతోషం గుర్తుచేస్తుంది నీతో ఉన్న మధురక్షణాలని
భాద గుర్తుచేస్తుంది నీవు లేని ఏకాంత ప్రణయాన్ని

ఏ చోటైనా ,ఏ బాటైనా నీ జతలేక నన్ను తాట తీసేస్తున్నాయి

జాబిలి లేని నీలాకాశాన్ని
సూర్యుడు రాని చీకటి ప్రపంచాన్ని
నేనెప్పుడూ ఊహించుకోలేదు

నా ప్రపంచం నువ్వే ...... నా నీలాకాశం నువ్వే
నీకై నిరీక్షించే ఆ నీలిమేఘం నేనే


0 comments:

Post a Comment