Wednesday, 6 July 2016

కవిత నెం 221:నా ప్రేమాక్షరాలు

కవిత నెం :221
*నా ప్రేమాక్షరాలు * నీ మందారవింద సుందరమోము చూసి 
నాలోన తేజము ఉత్సాహముగా ఉద్భవించే 

నీ నోటి  ముత్యపు పలుకులను శ్రవించగా 
నాలోని మౌనము స్వరగంధులను  చీల్చుకువచ్చే 

నీ నయనములలోని పొంగివచ్చే ప్రేమ చూసి 
నా హృదయము తన్మయత్వం తో పులకరించే 

నీవు నా కనులముందు పుత్తడిబొమ్మలా కదులుతుంటే 
నేను అగరబత్తిలా నీ చుట్టూ  వ్యాపించి యుండిపోనా 

నీ స్పర్శ నా నుదుటిని తాకిన వెంటనే 

నాలోని పైత్యము నన్ను వీడి , మనోల్లాసము కలిగించెగా

నీ ఆగమనం కోసం   ఎదురుచూస్తూ 

నా పాదాలు నా చుట్టూనే  తిరుగుతూ 

నా కలము మన ప్రణయాన్ని గుర్తుచేస్తూ 

ఈ ప్రేమాక్షరాలకు పునాదినిస్తూ 

స్వాగతిస్తుంది నీ రాకకై 
పరవశిస్తుంది నీ ప్రేమకై 


//గరిమెళ్ళ గమనాలు //





Related Posts:

0 comments:

Post a Comment