Thursday, 9 June 2016

కవిత నెం 220 :హాయ్ చెప్పాలని ఉంది

కవిత నెం : 220

హాయ్ చెప్పాలని ఉంది 
నన్ను  పిలిచే సూర్యునికే 
హాయ్ చెప్పాలని ఉంది 
నిద్ర లేపే ''మార్నింగ్ ''కే 
హాయ్ చెప్పాలని ఉంది 
నన్నంటి ఉండే ''షాడో ''కే 
హాయ్ చెప్పాలని ఉంది 
కనిపించే ''ప్రకృతి  '' కే 
హాయ్ చెప్పాలని ఉంది 


చిన్ననాటి మిత్రులు కనపడితే 
చిన్ని సంతోషం ఎగపడితే 
తీయని జ్ఞాపకం తిరిగొస్తే 
ఆగని మేఘం దిగి వస్తే 

హాయ్ చెప్పాలని ఉంది 
అద్బుతమే అలరిస్తే 
హాయ్ చెప్పాలని ఉంది 
అనుభవమే పులకిస్తే 

చీకటి తెరలు విడిపోతే 
వెలుతురుగా అవి మారిపోతే 
కష్టమనేది కరుణిస్తే 
ఇష్టపడ్డది ఎదురొస్తే 

హాయ్ చెప్పాలని ఉంది 
వెళ్ళిన వయసు తిరిగొస్తే 
హాయ్ చెప్పాలని ఉంది 
తుళ్ళిన మనసు తొంగిచూస్తే 

భాద లేని రోజుఉంటే 
బంధాలు అన్నీ  స్థిరమయితే 
మంచి మాత్రమే వికసిస్తే 
ఏ ద్వేషమూ దరిచేరకుంటే 

హాయ్ చెప్పాలని ఉంది 
మనమంతా మనుషులైతే 
హాయ్ చెప్పాలని ఉంది 
ప్రపంచమే వసంతమైతే 















Related Posts:

  • కవిత నెం79:ఏమౌతుంది కవిత నెం :79 //ఏమౌతుంది // ఏమౌతుంది ...................  మనసు మూగబోయింది మాట పొదుపు నేర్చింది కాలం ముందుకెళ్తుంది సమయం జారిపోతుంది ఆశ అల్లుకుప… Read More
  • కవిత నెం84:నేనంటే కవిత నెం :84 నేనంటే <<<<<>>>>>>>>>నేనింతే  **************************** నేనంటే ..... నేనింతే  నా… Read More
  • కవిత నెం82:నీతో నీవు కాసేపు కవిత నెం :82 నీతో నీవు కాసేపు  ************************** ఎప్పటికప్పుడు నువ్వే గ్రేట్ గా  చేసిన తప్పులో ఒప్పే నీదిగా  ఎందుకలా ఎదురుద… Read More
  • కవిత నెం81:ప్రేమిస్తా కవిత నెం :81 ప్రేమను ప్రేమగా పొందాను ,పొందుతున్నాను  ప్రేమను ప్రేమగా చూడటమంటే తెలుసుకున్నాను  ప్రేమకు అర్ధమే నీవని ,నీవుంటే ఏమీ అవసరంలేదని… Read More
  • కవిత నెం 83:ప్రేమంటే ... కవిత నెం :83 !! ప్రేమంటే ... !! ప్రేమంటే రెండక్షరాలతో మొదలయ్యే కావ్యం  ప్రేమంటే రెండు మనసులలో మెదిలే ''సరిగమ'' ల రాగం   ప్రేమంట… Read More

0 comments:

Post a Comment