Thursday 2 June 2016

కవిత నెం 217:నా ప్రేమ కధ

కవిత నెం :217
*నా ప్రేమ కధ *

** తప్పక చదవండి ఒకప్పటి ప్రేమికులు లారా 
విది ఆడిన వింత నాటకంలో విడిపోయిన జంటల్లారా  ***

మనసు పడ్డాను  సుమీ 
నీ పరిచయం ప్రణయంగా మారగా 
మాట ఇచ్చాను చెలీ 
పంచ భూతాలు దీవెనలు ఇవ్వగా 
తిరిగాము సంతోషంగా చిలుకా గోరింకలుగా 
ప్రేమను అందుకున్నాము ప్రకృతి పరవశించగా 
గొప్పగా అనిపించింది కదూ !
మన ప్రేమను చూసి - మన చెలిమిని చూసి 
ఆనందం కళ్లలోనే నిలిచింది కదూ !
ఒకరిని ఒకరు చూసుకునే క్షణాలలో నిలిచి 
ఆకలి దప్పికలను విడిచి 
మన అంతరంగ భావాలతో ఊసులాడాము 
నిదర రాని రోజులలో - నా కలల రాణిగా నీవు 
నిన్ను చేరుకునే తరుణంలో - నీ రాకుమారుడి గా నేను 
జీవితం చాలు అనిపించేది నువ్వు నాతొ ఉంటే 
ఇంకేమి వద్దని పించేది నీ అదరామృతం తింటే 
ఒక కులం ,ఒక మతం మాటే లేదు కదా 
మనం ప్రేమికులం అయ్యాకా ,ప్రేమ అనే మతం తీసుకున్నాక 
నీ స్వరం ఎక్కడున్నా నాకు వినపడుతూ ఉండేది ఎందుకో 
నీ స్పర్శ నాకు తగులుతూ ఉండేది నువ్వు నాతోనే ఉన్నట్టుగా 
ఏ పువ్వు చూసినా నీ నవ్వు కనిపించేది 
నువ్వు బాధ పడితే నా మనసు చెమ్మగిల్లేది 
ఇద్దరం ఒకటే అని - మన ఏకాంతం చెప్పేది 
ఇద్దరం వేరు వేరు అని - మన కుటుంభం గుర్తు చేసేది 
ప్రపంచాన్ని చూసి భయపడ లేదు ఏరోజు 
పెళ్ళి అనే పేరుతో అమాంతం విడిపోయాం 
మనం మారినా మన ప్రేమ మారలేదు 
మన వయసు మారుతున్నా మన ద్యాస వీడటం లేదు 

                                                       - గరిమెళ్ళ గమనాలు 















0 comments:

Post a Comment