Friday 3 June 2016

కవిత నెం 218:మాటే మంత్రం

కవిత నెం :218

* మాటే మంత్రం *

మన మాట సంకల్పితంగా వచ్చేది 
మన నోటి నుండి జారే ప్రతీ మాటకు మనమే బాధ్యులం 
అనాలోచితంగా కొన్ని మాట్లాడితే 
అసందర్భంగా మరి కొన్ని మాట్లాడుతూ ఉంటాం 
సరదాగా మాట్లాడుతూ కొన్ని ఉంటే 
ముక్కు సూటిగా మాట్లాడుతూ పోయేవి మరి కొన్ని 
మన ఎదిగిన కొద్ది మన మాట ప్రధానం 
మనం మారుతున్న కొద్దీ మాట తీరు అవసరం 
మనం మంచిగా మాట్లాడితే మంచిగానే జవాబు వస్తుంది 
చెడుగా మన పలకరింపు ఉంటే అది నీకే తగులుతుంది 
మనం  మాట్లాడేది భావాన్ని వివరించేది అయ్యి ఉండాలి 
మనం మాట్లాడితే కొందరికి అయినా వినసొంపుగా ఉండాలి 
మనం మాట్లాడితే మర్యాద ఇచ్చి పుచ్చుకునేట్టు గా ఉండాలి 
మన మాటలో భాష  అర్ధవంతంగా ,అణుకువ గా ఉండాలి 
చెప్పటానికి చిన్న మాటే అందరికీ 
చెప్పే మాటలు ఆచరణలోకి నోచుకోవు మరికొందరికి 
మన మాటకి హుందాతనం ఉండాలి 
మన ఒక మాట అనుకుని చెప్తే దానికి విలువ ఉండాలి 
రాను రాను ఈరోజుల్లో మాటలోని సంస్కృతి అంతరిస్తుంది 
గొప్ప గొప్ప చదువులు చదువుకున్నా 'బూతు ' లేని మాట లేదు 
పెద్దలైనా ,పిల్లలైనా మాటల్లో శ్రావ్యం కనపడదు 
నేనింతే అనుకుంటూ ,నేను మారలేను అనుకుంటూ 
నేటివిటీ అంటూ సరళమైన భాషను వదిలి దుర్భాష నేర్చుకుంటున్నారు 
తల్లి దండ్రులను పేరు పెట్టి పిలిచే సంస్కృతికి అలవాటు పడుతున్నారు 
నిజానికి నాకు మాట్లాడటం రాదు అందుకే 
మాట అంటే ఎలా ఉంటుందో అని గుర్తు చేసుకుంటూ 
ఈ చిన్న మాట నా కలం నుంచి పుట్టిన మాట 
                                                    - గరిమెళ్ళ గమనాలు 

0 comments:

Post a Comment