Thursday 19 November 2015

కవిత నెం 205 :ఆడు మగాడు

కవిత నెం : 205

అంతర్జాతీయ మగవారి దినోత్సవం సంధర్భంగా 

********************************************
((((((((((ఆడు మగాడు )))))))
_____________________________________________

చిరిగిన చొక్కానైనా ధరిస్తాడు
తన పిల్లలకు ఏ లోటూ రాకుండా చూస్తాడు
ఆడు మగాడు ఒక 'నాన్న 'గా

మాసిన గడ్డంతో తిరుగుతూ ఉంటాడు
తన భార్య అందంగా ఉంటే చాలనుకుంటాడు
ఆడు మగాడు ఒక 'భర్త' గా

చూస్తానికి జులాయిలా కనిపిస్తాడు
పున్నామ నరకం నుంచి తప్పించే యోధుడవుతాడు
ఆడు మగాడు ఒక 'కొడుకు ' గా

అల్లరిచేస్తూ ,ఏడిపిస్తూ ఉంటాడు
అపురూపంగా తన గుండెల్లో పెట్టుకుంటాడు
ఆడు మగాడు ఒక 'సోదరుడు' గా

ఎనలేని ప్రేమను కురిపిస్తాడు
తన ప్రేమకోసం ప్రాణ త్యాగానికైనా సిద్దపడతాడు
ఆడు మగాడు ఒక 'ప్రేమికుడు ' గా

అన్నివేళలా అందుబాటులో ఉంటాడు
అత్మీయతనందిస్తూ నీ అంతరాత్మ గా నిలుస్తాడు
ఆడు మగాడు ఒక 'స్నేహితుడు' గా

సరదాగా గిల్లి కజ్జాలు పెట్టుకునే 'భావ ' గా

వదినంటే అమ్మతో సమానంగా భావించే 'మరిది 'గా

అత్తింట్లో కోడలికి ఆప్తుడు గా నిలచే 'మామ ' గా

నాన్న తర్వాత నీ మేలుకోరుకునే 'బాబాయి' గా

మంచి ,చెడులను విశ్లేషిస్తూ దారిచూపే 'పెద్ద నాన్న ' గా

ఇంటికి పెద్ద దిక్కుగా ఉంటూ ,తోడుగా ఉండే 'తాతయ్య ' గా 

కుటుంబ భారాన్ని మోసే ఒక 'కూలీ ' గా 

చెమట చిందించు వేళ ఒక 'శ్రామికుడు ' గా 

బాధ్యతలను సమర్దవంతంగా నిర్వహించే ఒక  'ఉద్యోగి' గా 

నీ లక్షానికి చేర్చుటలో ఒక 'డ్రైవర్' గా 

దేశాన్ని సంరక్షించే ఒక 'సైనికుడు' గా 

కర్తవ్యాన్ని నిర్వర్తించే 'కర్త ' గా 

విశ్వాన్ని నడిపించే 'సృష్టికర్త ' గా 

చెప్పుకుంటూ పొతే ఎన్నో విధులు 

ఈ 'పురుషుడు 'లేనిదే ఏ కార్యమూ ఉండదు 

నేడు జరుగుచున్న ప్రపంచ తీరును బట్టి 

మగాడు 'మృగాడు ' గా మారటం చూసి 

పురుషులలో పుణ్య పురుషులు లేకపోవటం చూసి 

ఒక మగాడిని మగాడుగా  చూడలేని లోకంతీరుకు దారి తీసి 

కాని ఇవన్నీ ఒక్కసారి పక్కన పెడితే 

ఆడు మనసున్న 'మగాడే ' మరీ 




















0 comments:

Post a Comment