Friday 13 November 2015

కవిత నెం 204:నేటి చుట్టరికాలు

కవిత నెం :204

**నేటి చుట్టరికాలు **

పేరుకి ఉంటుంది రక్త సంబంధం 
కాని మనసులకి ఉండదు ఏ సంబంధం 

కలిసి యుండలేరు 
కలిసినా మనస్పూర్తిగా మాట్లాడుకోలేరు 

నేనే పెద్ద ,నేను చిన్న అనే ఆలోచన తప్ప 
పలకరింపుకి పెదవుల్ని కదిలించలేరు 

వారి స్వార్ధం ,స్వప్రయోజనమే ముందు 
మన తోటి వారే , మన వారే అని తలంచకుండు 

గౌరవం ఇస్తున్నా అది అందుకోలేరు 
ఇంకేదో కావాలని ,బెట్టుగా కూర్చుంటారు 

కుటుంబంలోని బంధాలు కంటే 
సమాజంలోని డబ్బు ,పరపతికై చూస్తుంటారు 

మనవాళ్లు మన స్థాయి కన్నా తక్కువైతే 
మాటవరసకి పిలిచి అవమానిస్తారు 
ఒకవేళ రాకపోతే రాలేదని సాధిస్తారు 

తనకంటే బంధువులలో గొప్పవాళ్లు ఉంటే 
అతిది మర్యాదలతో సత్కరిస్తుంటారు 

ఒకరిని ఒకరు నమ్మలేరు 
ఒకరిపై ఒకరు ప్రేమను పొందలేరు 

నిజమైన ప్రేమ , వాత్సల్యం మరుస్తారు 
కనిపించే డాబుకి ,డబ్బుకి విలువిస్తారు 

అందరిముందు పలానా అని చెప్పుకోలేరు 
ఒకరు వీరికన్నా బాగుంటే ఓర్చుకోలేరు 

అవసరం ఉంటే మాత్రం ఆత్మీయత కురిపిస్తారు 
అవసరం లేదంటే నీ గురించి ఆరా కూడా తీయరు 

పల్లెటూర్లలో ఉన్నప్పుడు చుట్టమే కదా ఆత్మీయం 
పట్నాలు వచ్చాక ఏకాంతమే నీకున్న ఆతిధ్యం 

పండుగలకైనా ఆహ్వానించు కోగల్గుతున్నారా ఇప్పుడు 
ఎవరి తీరు వారే ,ఎడ ముఖం పెడ ముఖాలే కదా ఎప్పుడూ 

పిలిస్తే ప్రేమగా  పలికే చుట్టరికాలు ఉండాలి కాని 
వచ్చామా ,వెళ్ళామా అంటే మాత్రం అవి చట్టరికాలే 

మారుతున్న కాలంతో పాటు బంధాలు మారుతున్నాయి 
ఆ బంధాలు వలన వట్టి బాధలే మిగులుతున్నాయి 

గుర్తుంచుకోండి అందరూ ....... 
మన వారు ,మనకోసం ఉన్నప్పుడు ఆ బంధాన్ని నిలుపుకోండి ఎప్పుడూ 

- గరిమెళ్ళ గమనాలు 

0 comments:

Post a Comment