Tuesday 24 November 2015

కవిత నెం 206:ఫేస్ బుక్ స్నేహాలు

కవిత నెం :206

ఫేస్ బుక్ స్నేహాలు

ముఖాలు కనపడవు - ముఖ చిత్రాలు ఉంటాయి 
మనసు తెలియదు - మాటలెన్నో చెప్తాయి 
చిరునామా తెలియదు - కొత్త స్నేహాలు పుడతాయి 
బంధువులెందరు ఉన్నా - ఏ బందుత్వాలు పట్టవు 
అమ్మా ,నాన్న పక్కనే ఉన్నా -  ఆత్మీయతలుండవు 
మొగుడు పెళ్లాల మధ్య - చిచ్చు రగిలిస్తూ ఉంటాయి 
మన దినచర్యను మొత్తం - పబ్లిక్ కి తెలియచేస్తుంటాయి 
రోజుకొక పోస్ట్ పెట్టించి - స్టేటస్ పరిశీలించమంటాయి 
లైక్స్ ,కామెంట్స్ అంటూ - కొత్త మోజు తగిలిస్తాయి 
తెలియని పబ్లిసిటీ కోసం - ఆరాటం పెరిగేలా చేస్తాయి 
ఫ్రెండ్స్ లిస్ట్ ,చాట్ బాక్స్ లతో - కాలక్షేపం చెయ్యమంటాయి 
మీటింగ్స్ ,ప్రోగ్రామ్స్ అంటూ - కొత్త టైం టేబుల్నిస్తాయి 
నిజమైన స్నేహాలు కొన్ని - మొహమాట మిత్రాస్ కొన్ని 
అనవసర పరిచయాలు కొన్ని - అవసరాలకి అండ కొన్ని 
కొత్త అనుభవాలు కొన్ని - చేదు జ్ఞాపకాలు కొన్ని 
మంచి సంకల్పం కోసం కొన్ని - చెడ్డ కార్యకలాపాలు కొన్ని 
పొగరుగా ,వగరుగా - చిరు చిరు స్నేహాలు చిగురించగా 
కారంగా ,మమకారంగా - మధుర బందాల్ని కలుపంగా 
గుసగుసలు కొన్నైతే - రుసరుసలు చూసేవి కొన్ని 
ఆహ్లాదం ,ఆనందం తెచ్చేవి కొన్నైతే - నిరాశతో చూసేవి కొన్ని 
కొన్ని ప్రయోజనాలే - మరికొన్ని నిస్ప్రయోజనాలు 
సోషల్ మీడియా లో పుట్టే స్నేహాలు మాత్రమే ఇవి 
మన సొంతం అనుకుని -మరీ మునిగి పోకండి 
ఇవే ప్రధానం అనుకుని - మీ పనులను మానుకోకండి 
మరీ శృతిమించకుండా -స్నేహ వాతావరణాన్ని ఉంచండి 
ఆరోగ్యంగా ,అందంగా ఉండేలా -ఫేస్ బుక్ స్నేహాలు చెయ్యండి 

0 comments:

Post a Comment