Thursday 26 November 2015

కవిత నెం 208:నేను కవినేనా ?

కవిత నెం :208

నేను కవినేనా 


నేను కవినేనా 

మనసు పెట్టే రాస్తాను 
నా కాలానికి పని చెబుతుంటాను 
మరి నేను కవినేనా ?

అక్షరాలను కలుపుతూ ఉంటాను 

అంతరంగాన్ని పలికిస్తూ ఉంటాను 
మరి నేను కవినేనా ?

పాండిత్యంలో ప్రావీణ్యం లేదు 

సాహిత్యాన్ని అభ్యసించలేదు 
మరి నేను కవినేనా ?

అనుభవాలతో అల్లికలు చేస్తుంటాను 

మనోభావాలతో రాతలు రాస్తుంటాను 
మరి నేను కవినేనా ?

అందంగా వర్ణిస్తానో తెలియదు 

అర్ధవంతంగా లిఖిస్తానో తెలియదు 
మరి నేను కవినేనా ?

పుస్తక పఠనం చాలా తక్కువ

మనసు  పఠనం అంటే కొద్దిగా మక్కువ 
మరి నేను కవినేనా ?

నేను రాసేది బాగుంది అనుకుంటాను 

నేను రాసినది నిరుపయోగం కాదనుకుంటాను 
మరి నేను కవినేనా ?

నేననుకున్నది రాయటమే తెలుసు 

నేచెప్పదలుచుకున్నది నాకు ఇలాగే వచ్చు 
మరి నేను కవినేనా ?

ఒకరి ఆదరణ పొందలేని అనర్హుడిని 
నా మనసుని నమ్మిన నాకు నేనే నేస్తాన్ని 
మరి నేను కవినేనా ?

అనవసర రాద్దాంతాలు నా కలం కి లేవు 
అవసరమైన సందేశం  ఒకటున్నా చాలు 
మరి నేను కవినేనా ?

నా రాతలు పిచ్చి కాగితాలే 
నా భావాలు మట్టి బొమ్మలే 
మరి నేను కవినేనా ?

పెద్దగా ఎవ్వరితో పరిచయాలు లేవు 

ఎటువంటి బిరుదులు నా కంటూ లేవు 
మరి నేను కవినేనా ?

కవి అన్న గుర్తింపు కార్డ్ నాకు లేనే లేదు 

ఏ మహామహులతో నేను పోల్చుకోలేను 
మరి నేను కవినేనా ?

నేనింతే అనే అహంబావి ని కాను 
నేర్చుకునే విద్యార్దినే ఈ కాలంలో ,కవిత్వంలో 
మరి నేను కవినేనా ?

- గరిమెళ్ళ గమనాలు 






0 comments:

Post a Comment