Tuesday, 22 December 2015

కవిత నెం 211:నిజం అబద్దంల నిజం

కవిత నెం :211

నిజం అబద్దంల నిజం  

నిజమెప్పుడూ లోపలే దాగుంటుంది 
ఎందుకంటే అబద్దం అందంగా ఉంటుంది కాబట్టి 

నీకు తెలిసింది కాబట్టి అది నిజమనుకుంటే 
తెలియకుండా దాగున్న విషయం మాటేమిటి ?

నిజమెప్పుడూ నిప్పులా మండుతూ కనిపిస్తుంది 
అబద్దం ఆవలింపులా నీతోనే ఉంటుంది 

ఒక్కసారి నిజం చెబితే ,చరిత్ర మారుతుంది 
కాని అబద్దం అలవాటైతే ,చరిత్రనే దహిస్తుంది 

కనపడకుండా పోయేది ''నిజం '' నేటి కాలంలో 
కనిపిస్తూ ,కవ్విస్తూ ఉండేది ''అబద్దం '' ఈ కలికాలంలో 

నిజాన్ని నమ్మలేని జనాలున్న కాలంలో 
అబద్దాన్ని నిజం చేసే మహాత్ములు ఎందరో 

మనం జీవిస్తున్నది నిజంలోనా ? అబద్దంలోనా ?
మనం చూస్తున్నదంతా నిజమా ? అబద్దమా ?

మీరు చెప్పగలరా ? చూపించగలరా ?
అలా చేయగల్గితే మీరు మాట్లాడేది ఒక్కటే ఉండాలి 
అది నిజమా (లేక ) అబద్దమా ?

మనిషి పుట్టుక ఒక నిజం 
మనిషి చావు ఒక నిజం 
మధ్యలో జరిగే జీవితం ఒక ''కల్పితం ''
ఇది ఎక్కడో విన్నట్టు ఉంది కదా !

నిజాన్ని అబద్దమనుకుని 
అబద్దాన్ని నిజమనుకుని 
మన జీవితం కొన్ని కొన్ని సార్లు బోల్తాకొడటం నిజమే కదా 

నిజాన్ని చెప్పాలంటే ధైర్యం ఉండాలి 
అబద్దాన్ని చెప్పాలంటే చిన్న కారణం చాలు 

అవసరం ''అబద్దాన్ని '' పలికిస్తుంది 
భాద్యత ''నిజాన్ని '' బోదిస్తుంది 
ఏది పాటించాలో కాలమే మనకు నేర్పిస్తుంది 

కాని మన జ్ఞానంతో చేసే పని 
నీ వ్యక్తిత్వాన్ని నిలబెడుతుంది 

నిజంలో హాయి నిలుస్తుంది 
అబద్దం భయాన్ని కల్గిస్తుంది 
నీడలా నిన్ను వెంటాడుతూనే ఉంటుంది 

నిజం మంచి బంధాలను ఏర్పరుస్తుంది 
అబద్దం అందరినీ దూరం చేస్తుంది 
అబద్దం అలవాటైతే 
నీ బ్రతుకుకు ఉండబోదు విశ్రాంతి 


Related Posts:

  • కవిత సంఖ్య :281(జీవితమే ఒక ప్రశ్న) కవిత సంఖ్య :281 జీవితమే ఒక ప్రశ్న ఏదో వెతుకులాట ఎక్కడికో  ప్రయాణమట ఎంత ఉన్నా ,ఏమి తిన్నా తృప్తి లేని మనిషి తన అవసరాలకు మించి పరితపిస్తుంటాడు భ… Read More
  • కవిత నెం260:వెన్నెల్లో అమావాస్య కవిత నెం :260 *వెన్నెల్లో అమావాస్య * ఒక  నిర్మానుష్యమైన భయం ఒక నిశ్శబ్దపు వాతావరణం ఎక్కడ అలికిడి జరిగిన ఉలిక్కి పడే రోజు రోజులు మారుతున్నా మూడ… Read More
  • కవిత నెం 273:ఆటో వాలా కవిత నెం :273 *ఆటో వాలా * జీవన భృతి కోసం మనిషి పట్టిన మూడు చక్రాల రధం ......... ఒకప్పుడు ఒకటి ,రెండు ,మూడు ఇప్పుడు వందలు కాదు వేలు ఒకడి కింద నలుగుత… Read More
  • కవిత నెం 261:నిద్ర కవిత నెం :261 నిద్ర గాడంగా మనసు భారంగా కనులు ఆపంగా కునుకు దీర్ఘంగా కనులు ఎరుపెక్క తలంతా తిక్క తిక్క నా కనుబొమ్మలు అటకెక్క నా ఒళ్ళంతా తిమ్మిరెక్క ఎ… Read More
  • కవిత నెం 262:పిచ్చి మా తల్లి కవిత నెం :262 *పిచ్చి మా తల్లి * నువ్వెంత మగాడివి అయినా ఏదైనా భరించగలిగే శక్తి ఉన్నది ఒక్క  ''స్త్రీ '' మాత్రమే కానీ తనను , తన ప్రేమను భరించే శ… Read More

0 comments:

Post a Comment