
కవిత నెం :67
రైలు నడుస్తుంటే
*******************
రైలు నడుస్తుంటే.......
పొగమంచుల నుంచి
దూరపు కొండల మద్య నుంచి
పచ్చని పైరు చేల నుంచి
చల్లని హోరు గాలి నుంచి
పొడిచే సూరీడు వస్తున్నాడు
ఈ రైలు బండి వేగంతో
ఎర్రని సూరీడు ఎగురుతున్నాడు
పొడిపొడిగా
సూర్యరశ్మిని
రైలు కిటికీలనుంచి
తలుపులనుంచి
మనకు అందిస్తున్నాడు
రైలు నడుస్తుంటే.....
చూస్తే పట్టాలు కొట్టుకుంటాయి
చూస్తే పట్టాలు
పరిగెడుతుంటాయి
రైలు కింద నుంచి భూమి
ఎంతో వేగంతో...