Wednesday, 13 January 2016

కవిత నెం 213(ఎదురుచూపుల సంక్రాంతి )

కవిత నెం :213 ఎదురుచూపుల సంక్రాంతి  ఎంతమంది నానమ్మ ,తాతయ్యల ఎదురుచూపులో  ఈ సంక్రాంతి పండుగకైనా తమ మనువడు వస్తాడని  ఎంతమంది అమ్మా ,నాన్నల మమకార చూపులో  ఈ సంక్రాంతి పండుగకైనా తమ కొడుకు వస్తాడని  ఎంతమంది అత్తా ,మామల ఆత్మీయ పిలుపులో  ఈ సంక్రాంతి పండుగకైనా తమ అల్లుడు వస్తాడని  ఎంతమంది కొత్త అల్లుళ్ల కోరికల చిట్టాలో  ఈ సంక్రాంతి పండుగకి అత్తింట వారి కానుకుల కోసం  ఎంతమంది అక్కల అనురాగచూపులో  ఈ సంక్రాంతి పండుగకైనా తమ్ముడు చెంతకు చేరతాడని  ఎంతమంది మరదళ్ల ఎడబాటు చూపులో  ఈ సంక్రాంతి పండుగకైనా...