Friday, 24 August 2018

329(తెలంగాణ -జలధార)

కవిత నెం :329 *తెలంగాణ -జలధార * తెలంగాణ జల మణిహార మాగాణం కొత్త జలాశయంతో నిండుతుంది తెలంగాణం నీటికొరతను రూపుమాపుటకు నిలచే జలద్వీపం ప్రతి చినుకును ఒడిసిపట్టే విజయమంత్రం ఆసియాఖండంలోనే అత్యద్భుత జలధామం రైతన్నల ఆశల సౌధం ఈ కాళేశ్వర ఎత్తిపోతల పధకం సాగు ,తాగు నీటి అవసరాలను తీర్చే గంగా తీరం ఇరిగేషన్ ప్రాజెక్టులో ఇది నిత్య నూతనీయం మిడి గడ్డలో నిర్మించే రిజర్వాయరు నిర్మాణం మేధస్సును తలపించే మన కాళేశ్వర ప్రాజెక్ట్ వైభవం బతుకుల్లో పచ్చదనం నింపే బంగారం కండ్లు మిరిమిట్లు గొలిపే సొరంగాల నైపుణ్యం గోదావరితో  సరస్సు , నదీ జలాల అనుసంధానం పరివాహిత ప్రాణహిత...