Monday, 1 October 2018

కవిత నెం : 330(నై -వేదం)

కవిత నెం : 330 కవితా శీర్షిక : నై -వేదం మనుషులగానే కనపడతారు మనసులోని విషయాన్ని నవ్వుతూ వెదజల్లుతారు పొగడ్తలకు పొంగిపోయే రోజులు నిశ్శబ్దాన్ని ఎలా సహించగలరు ? కపటబుద్దితో కాసుకొని ఉందురు నంగనాచి నాటకాలు ఆడుతూ ఉందురు నమ్మకం అనే వస్తువుకై ఎదురుచూపులు నమ్మినవారిని సునాయాసంగా ముంచుదురు కోప -ప్రదర్శనకు కాదేది సంఘటనకు విరుద్ధం ఇష్టంలేని చోటే చిరాకుకు పట్టాభిషేకం చూడటానికి అందరూ బంధువులే  అలవాటుపడ్డావా పీక్కుతినే రాబందులే  కదిలిస్తే అందరూ భయపడేవాళ్లే  గాంభీర్యం పైన కప్పుకునే వస్త్రం మాత్రమే  నిజాయితీ ,నిబద్దత అంటూ నీటి సూత్రాలే  అబద్దాల...