kavita samkya :332
శీర్షిక : నా మౌనం
గరిమెళ్ళ రాజేంద్ర ప్రసాదు
హైదరాబాద్
కకావికలమై క్రోధిస్తున్నది
జకాశకలమై జ్వలిస్తున్నది
తపోభూమిలో తపిస్తున్నది
ప్రళయపిలుపులో ప్రకంపిస్తుంది - నా మౌనం
ఆర్తిగా పూర్తిగా ఎదురుచూడదు
చాటుగా మాటున లెక్కలేయదు - నా మౌనం
కరకరమని విరులు నెగరగా
చరచరమని వాయువీయగా
నెత్తిన మండే జలము పొంగగా
జిహ్వమంచున జ్వాల పుట్టగా
తమాయింపులో తాంబూల సమర్పణ
తట్టుకోమని తాంత్రిక మర్దన
జట్టుకామని నెత్తుటి వరదా
హద్దు ఉందని స్వర ఘర్షణే - నా మౌనం...