కవిత నెం :333
కవిత శీర్షిక : తెలంగాణ వేమన
''వినుడి మాయప్ప సిద్ధప్ప విహితుడప్ప
కనుడి కరకుప్ప కవికుప్ప కనకమప్ప''
ఈ యొక్క మకుటం తలచిన చాలు
జ్ఞప్తికొస్తాయి సిద్దప్ప గారి తత్వబోదాలు
తెలుసుకుంటూ పోతుంటే వీరి జీవితాన్ని
ఏదో జిజ్ఞాసతో కూడిన జ్ఞానంబు దక్కెనె
శ్రీ విరాట్ పోతులూరి వీరబ్రహ్మం గారి తదుపరి
మనకు లభించిన మహా రాజయోగి - సిద్ధప్ప
సమాజం బాగుండాలని తపించిన తాత్వికుడు సిద్ధప్ప
కులవ్యవస్థను తూర్పారబట్టినాడు మన కవి సిద్దప్ప
గొప్ప సీస పద్యాలతో వెలుగిందినవారు -సిద్దప్ప
సమాజహితాన్ని కోరిన ఏకైక గురువులు - సిద్దప్ప
ప్రతీ ఏటా గురుపూజోత్సవంలో...