కవిత నెం : 337
కరోనా
ఈ కరోనా ప్రభావంతో
ఒక మనిషి ఆలోచనలు
భూమి గుండ్రంగా తిరుగుతున్నట్టు
ప్రపంచం మొత్తం ఒకేసారి తక్కువ సమయంలో
వారి గతం నుంచి వర్తమానం వరకు
నేటి వర్తమానం నుంచి భవిష్యత్తు కొరకు
నిముషానికి గుండె ఎన్ని సార్లు కొట్టుకుంటుందో
అన్ని సార్లు ఆలోచన ప్రవాహాలు పరిగెత్తుతున్నాయి
ఒకవైపు ప్రాణం గుప్పెట్లో పెట్టుకుని
అది ఉంటుందా పోతుందా అనుమానం
ఒకేసారి ప్రాణం పోయినా పర్లేదు
అది సగం గమ్యం వైపు వెళ్లి ఎక్కడ సంకటమవుతుందో అని
ఒకేసారి మన జీవం మన శరీరాన్ని విడిచిపోతే
మన చుట్టూ పేరుకుని ఉన్న బంధాలు ,బాధ్యతల పరిస్థితి
ఈ ప్రళయం విషమం కాకపోయినా...