Sunday, 28 June 2020

కవిత నెం :340(నీ జ్ఞాపకంలో - నేనున్నా నాన్న )

కవిత నెం :340 కవితా శీర్షిక : నీ జ్ఞాపకంలో - నేనున్నా నాన్న  నువ్వంటే ఇష్టం నాన్న నీ రూపంటే ఇష్టం నాన్న నీ ఊహ తెలియకుండా ఎదిగా నాన్న నువ్వంటే ఇష్టం నాన్న నీ పేరంటే ఇష్టం నాన్న నిన్ను ''లేటు '' అని చెప్పే పరిస్థితి ఏంటి నాన్న ? నీ వేలుపెట్టి నడిచానో లేదో తెలియదు నీ స్పర్శ కావాలనిపిస్తుంది నాన్న నీ భుజాలపై ఆడానో లేదో తెలియదు నా విజయకెరటం నీ భుజాలపై నిలపాలనుంది నాన్న నీ గుండెలపై హత్తుకున్నావో లేదో తెలియదు నీ హృదయాన్ని హత్తుకోవాలనుంది నాన్న నా చిన్నప్పుడు మా నాన్న అలా -ఇలా అనే వాడిని  నాన్న నిన్ను తలుచుకుంటూ బ్రతికేసా...