Saturday 29 March 2014

కవిత నెం :19 //జెండా //

కవిత నెం :19 //జెండా //

మూడు రంగుల జెండా ఇది మువ్వన్నెల జెండా 
రెప రెప లాడుతూ రివ్వున ఎగిరే జెండా 
కులమత బాష బేదాలకు అతీతమై వెలసిన జెండా 
సమరవీరుల త్యాగఫలాలకు చిహ్నమై నిలచిన జెండా 
పరాయిదేశ పాలన నుంచి స్వాతంత్రం తెచ్చిన జెండా 
మన మంతా బారతీయులం అని చాటి చెప్పిన జెండా 
సుందరయ్య కలం నుంచి జాలు వారిన చిత్రం ఈ జెండా 
పింగళి హస్తం నుంచి రూపాంతరం చెందినది  ఈ జెండా 
సస్యశ్యామల సుభిక్ష ధరణీతల సంకేతం ఈ జెండా 
అహింసా ,శాంతి ,సౌబ్రాతత్వములు కలిసినది ఈ జెండా 
భారత దేశ చరిత్రకు సగర్వ కారణం ఈ జెండా 
నిత్యనూతనంగా ఎగరాలి మన జాతీయ జెండా 
భావి భారత ప్రగతికే విజయకేతనం ఈ జెండా 

Friday 28 March 2014

కవిత నెం :18 //ఉగాది //

కవిత నెం :18 //ఉగాది //

వసంతకాలాన విరబూసే చైత్ర మాస సోయగం ''ఉగాది''
ప్రకృతిని పులకరింపచేసే  చైత్ర శుద్ధ పాడ్యమి ''ఉగాది ''
మనసుని పలకరించే మళయ మారుతం ''ఉగాది''
తెలుగువారి ప్రధమమైన పండుగ ''ఉగాది ''
తెలుగింటి లోగిళ్ళలో  తొలకరి జల్లు ''ఉగాది''
కష్టసుఖాల మాధుర్యాన్ని తెలిపే పండుగ ''ఉగాది''
ఆత్మీయ అనుబందాన్ని గుర్తు చేసే పండుగ ''ఉగాది''
షడ్రుచుల సుగంధ  సౌందర్య సమ్మేళనం ''ఉగాది''
సంస్కృతి సాంప్రదాయాల సంగమం ''ఉగాది''
ఆమని సొగసుల  హరిత వర్ణ శోబితం ''ఉగాది''
కోకిల కిల కిల రావాల సంగీతాలాపనం ''ఉగాది''
మరుమల్లెల గుభాలింపుల పరిమళభరితం ''ఉగాది''
గుండెల్లో ఆనందక్షణాలను నింపే ఉషోదయం ''ఉగాది''
నిరాశ నిసృహలను  పారద్రోలి ఆశలను చిగురింపచేసే పుష్పం ''ఉగాది''
కాలమాన పరిస్థితులను తెలిపే భవిష్యశ్రవణం ''ఉగాది''
విజయాలను ప్రసాదించే వార్షిక పర్వం ''ఉగాది''
సకల మానవాళికి సంతోషాలను ఇచ్చే నందనవనం ''ఉగాది''
నూతన చైతన్యాన్ని,ఉత్సాహాన్ని  అందించే వసంతం ''ఉగాది''
శ్రీ హేవలంబి నామ  సంవత్సర ''ఉగాది''
ఈ జగతికే వన్నెలు తెచ్చే విలువ గల్గిన పర్వం ''ఉగాది''








Friday 21 March 2014

కవిత నెం 17:అమ్మంటే

కవిత నెం :17

అమ్మంటే ప్రేమకు అపురూపం 
అమ్మ  అను పిలుపే ఆయుష్షునిచ్చే అమృతం 
కనిపించే మమతల కోవెల అమ్మ 
కదిలొచ్చే  ఆమని వెలుగు అమ్మ 
మాతృత్వానికి మానవతా రూపం అమ్మ 
ఆప్యాయత అనురాగాల అవని అమ్మ 
మనసులో మెదిలే భావాక్షరం అమ్మ 
కలత చెందగా శక్తినిచ్చే మాతృబలం అమ్మ 
ఏ కష్టమంటూ దరిచేరనీయంది అమ్మ 
ఏ కల్మషం తెలియని కారుణ్యమూర్తి అమ్మ  
బాధను గుండెలో దాచుకొని ప్రేమను పంచేది అమ్మ 
ఈ జగతికే జనని ,సృష్టి కే ప్రతి సృష్టి అమ్మ 
ఎంత చెప్పినా తక్కువే అమ్మ గురించి 
తీర్చుకోలేని ఋణము కదా  మన నుంచి 
''మాతృ దేవో భవ '' అన్నది మరువకురా 
ఆదిలోనే అమ్మ ప్రేమను త్రుంచకురా
అమ్మ నువ్వెప్పుడూ బాగుండాలి 
అమ్మ నీ ప్రేమదీవెన మాకు తోడుగా ఉండాలి  

Wednesday 19 March 2014

కవిత నెం16:చందమామ


కవిత నెం :16
అల్లంత దూరాన ఓ చందమామ 
ఆకాశమున పండులాగా మా చందమామ 
పాలమీగడ తెల్లదనంతో ఓ చందమామ 
పసి పాపలకు ముద్దొస్తావ్ మా చందమామ 
అందరికీ బంధువు నీవు ఓ చందమామ 
మామలకే మామ నీవు మా చందమామ 
నీలి మబ్బుల మాటున ఓ చందమామ 
 నెలవంకవై  తిరుగుతావు మా చందమామ 
పండు వెన్నెలను కురిపిస్తూ ఓ చందమామ 
వెన్నెలవై విరిసావు మా చందమామ 
ప్రేమికుల మనస్సులో ఓ చందమామ 
ప్రేమ జాబిల్లివై నిలిచావు మా చందమామ 
ప్రపంచమంతా  పయనించే ఓ చందమామ 
రేరాజుగా పిలువబడే మా చందమామ 

Friday 14 March 2014

కవిత నెం15 :ప్రేమ నౌక

కవిత నెం :15
*ప్రేమ నౌక * ఎర్రని మబ్బుల సైతం 
నా ఎదని కమ్మేస్తున్నాయి 
నీ కోసం అన్వేషణ చేస్తున్న నన్ను 
అడుగడుగుకి ఆపదలు అడ్డుకొంటున్నాయి 
నాకే మార్గము లేదు చెలీ 
నాకు తోడుగా సహాయం చేయటానికి ఉన్న ఈ 'నౌక' తప్ప 
తీరమేదో తెలియదు కాని ఒంటరిగా చేస్తున్న ఈ 'నౌక' ప్రయాణం 
నిస్సహాయుడనై ఆశల దీపాలు తగిలించుకుని ఎర్రబడ్డ నా కన్నులతో 
నీ కోసం ,నీ జాడ కోసం చేస్తున్నా నిరంతర పడవ ప్రయాణం 
నీ ప్రేమాంతర తీరాన్ని చేరేదాకా !
నా ప్రేమ హృదయాన్ని నీకు అర్పించేదాకా !


Tuesday 11 March 2014

కవిత నెం 14:మదర్ థెరిస్సా

కవిత నెం  : 14

అమ్మతనంలో అనురాగరూపం '' మదర్ థెరిస్సా''
అనాధలకు మరో మాతృరూపం ''మదర్ థెరిస్సా''
విశ్వశాంతికై వెలసిన అనురాగ  విశ్వం 
నిరుపేదలను ఆదరించిన నిర్మల హృదయం 
వ్యాదిగ్రస్తులకు ఆశ్రయం కల్పించిన మానవత్వం 
సేవే తన ధర్మంగా బావించిన ఆదర్శవనిత 
ప్రేమే తన లక్ష్యంగా జీవించిన ప్రేమామయి 
మానవ సేవయే మాధవ సేవ అని 
 చాటి చెప్పిన దృవతార   ఈ  '' మదర్ థెరిస్సా''
మానవాళి కోసం పుట్టిన మానవ దైవం మన  '' మదర్ థెరిస్సా''