Sunday 29 May 2016

కవిత నెం 215:సోషల్ మీడియా స్నేహ గురి

కవిత నెం :215

సోషల్ మీడియా స్నేహ గురి :-

ఏది నిజం ఏది కల్పితం 
ఎవరో తెలియదు 
ఏమి పోస్టు చేస్తున్నారో తెలియదు 
అనుభవజ్ఞులు ,మేధావులు  కొందరైతే 
చదువరులు కొందరైతే , ఆకతాయిలు కొందరు 
మనసుకి తోచింది వాల్ పైన పెడటమే అలవాటు 
మరొకరి రాసింది కొట్టేసి వీరి సొంత మార్కులకై తడబాటు 
 సరదాలు కొన్నైతే - సాహిత్యాలు కొన్ని 
సహవాసాలు కొన్నైతే - సంతోషాలు కొన్ని 
తప్పో ఒప్పో తెలియదు ఈ సోషల్ మీడియా వచ్చాక 
నేర్చుకునేవి కొన్ని - నేర్పించేవి మరికొన్ని 
ఉపకారమే అందరికీ - వినియోగించుకుంటే 


Monday 23 May 2016

కవిత నెం 214:జీవిత మజిలి

కవిత నెం :214
*జీవిత మజిలి * జీవితం ఒక రంగులరాట్నం
కాలం ఒక మంత్రదండం
మనిషి ఒక కళాత్మకవస్తువు
ఏదో చెయ్యాలని అనుకుంటాం
ఏదో దొరికిందని తృప్తి పడతాం
బాధ్యతలకు తలవంచుతాం
బంధాలకు ముడి పడతాం
స్నేహాలకు విలువనిస్తాం
ప్రేమ అంటే పడి చస్తాం
రూపాయికి లోబడతాం
స్వార్ధానికి చేరువవుతాం
మరణం అంటే బయపడతాం
మరోజన్మను కోరుకుంటాం
అంతా తెలుసు కాని
మనమేంటో తెలుసుకునే సరికి
ఒక జీవిత కాలం నీకు బెల్ కొడుతుంది