Saturday 11 April 2015

కవిత నెం111:గురువు

కవిత నెం :111//గురువు //

గురువు అనే పదం గర్వమైనది .
గురువు అనే పదం మనకు మార్గమైనది
గురువు అనే పదం గౌరవప్రదమైనది.
గురువు అంటే ఆదివిష్ణువు 
గురువు అంటే దైవత్వం 
అందుకే గురుబ్రహ్మ, గురుర్విష్ణు,గురుర్దేవో మహేశ్వరః 
గురుసాక్షాత్ పరబ్రహ్మఅంటారు 
పూజ్యులైన తల్లిదండ్రులు -నీకు ఈ జన్మను ప్రసాదిస్తే 
నీ జన్మకు పరిపక్వత నిచ్చే తత్వం గురువుది.
నీకు నీవుగా ఈ సృష్టిలో ఏదీ తెలుసుకోలేవు,నేర్చుకోలేవు 
అందుకు నీకు సహాయపడే వ్యక్తుల్లో కాని ,వనరుల్లో కాని 
గురుతత్వాన్ని నీవు గ్రహించుట ,గురు భావాన్ని 
ఎల్లప్పుడూ సంపూర్ణంగా కలిగియుండుట 
నీ నైతిక  బాద్యతను తెలియచేస్తుంది 
నిన్ను విజయపధంలో నడిపిస్తుంది 
అది అనాటికాలంలో
ఏకలవ్యుడు నిరూపించి గురుమహత్వాన్ని చాటిచెప్పాడు 
గురుకటాక్షం పొందాడు.
కాని నేటికాలంలో 
''గురు'' అనే పదం ఒక ఊతపదంలా
''గురు'' అనే పదం ఒక వ్యంగాస్త్రంలా 
''గురు'' అనే పదం ఒక పులుస్టాప్ లా మిగిలిపోతుంది 
నీవు చిన్నప్పుడు స్కూల్ కెళ్ళి  చదివే వయసు నుంచి 
నీవు పెద్దవాడివై ఉద్యోగం చేయుచున్నా
వ్యాపారం చేయుచున్నా 
నీ ఫలితం వెనుక నిన్నింతవాణ్ని చేయుటకు 
సహాయపడిన వారికి ''కృతజ్ఞత'' ను 
మరుచుచున్నారు నేటితరం 
క్యాంపస్లో ఉన్నంతసేపు 
ఆఫీసుల్లో ఉన్నంతసేపు 
సార్ సార్ అని పిలిచి 
పక్కకి వచ్చాక వాడు అది వీడు ఇది
వాడెంత వీడెంత 
అని కుళ్లు జోకులు  వేసుకుంటూ,
వారిగురించి కుద్బుద్దిగా ఆలోచిస్తూ 
గర్వపురెక్కలు  ధరించి  
గురుసన్నిదానాన్ని  తెలుసుకోలేని 
అభాగ్యులుగా తయారవుతున్నారు .
నీకు అక్షరాభ్యాసం చేసి, అవపాసం పోసి 
నీ అడుగులకు అవాంతరాలు రాకుండా
నిన్ను కార్యదీక్షుడిని చేస్తూ 
నీ వెన్నంటి ఉంటూ 
కొండంత అండగా 
కుబేరుడిరూపమై ప్రత్యక్షంగా 
నీతో ఉండే సన్నిహితువు ''గురువు'' 
వారికి నీ ఆస్తిపాస్తులు అవసరం లేదు 
వారికి ఎటువంటి వ్యామోహములు ఉండవు 
నీవు సాదించే లక్ష్యం తో 
''విజయానందం'' చూసి సంతృప్తి పడే  
బోలశంకరుడు ''గురువు''
గురువు అంటే కాదు నీ ముందు నిలుచున్న రూపం 
గురువు అంటే కోవెలలో వెలుగుచూ ఉండే అఖండదీపం
దీపం నీ చీకటిని తరిమి వెలుగును ఇస్తుంది 
మరి గురువు అనే ఈ దీపం 
నీలో అజ్ఞానమనే చీకటిని సమూలంగా మాపి 
జ్ఞానకాంతిని నీలో ప్రకాశింప చేస్తుంది .
గురువు అంటే ఎవరో తెలుసుకో 
నీ గురుబావాన్ని పెంపొందించుకో 

ఓం గురు సద్గురు గురుభ్యోనమః 

!!!!!!!!!!!!!
గరిమెళ్ళ రాజా







0 comments:

Post a Comment