Saturday 11 April 2015

కవిత నెం116:అందోళన

కవిత నెం :116

నాలో ఎందుకో అందోళన 
తరుముతున్న అభద్రతా భావన 
చులకన చేసుకుంటున్నా 
గ్రహించక గ్రహపాటు పడుతున్నా 
నిరుత్సాహంతో నిలుస్తున్నా 
ఉత్సాహంతో ఉరుకుతున్నా 
క్షేమమనే దైర్యం కాసేపు
ఎందాక ఈ పయనం అనే అపనమ్మకం కాసేపు 
బుజ్జగిస్తున్నా నా మనసుని 
భాద్యతలని గుర్తుచేస్తూ 
కష్టపడే తత్వమున్నా 
అదృష్టానికే చూపు కాసేపు 
ఏమిటి ఈ జీవన పయనం 
సుఖ దుఖాల ఎడారిమయం 
ఆనందం అనే ''రైలు ఇంజన్ '' పట్టాల కేక్కితే 
భాద అనే ''వాహనం '' దానిని డీ కొడుతుంటే 
ఏదో సాదించామన్నా సంతృప్తి కాసేపు 
ఇంకా ఏదో లోటు అని వ్యాకులత ఒక వైపు 
గెలిచేది నేనే ,ఓడేది నేనే 
గెలుపుకి వేర్రవేగే ఆనందం 
ఓటమికి క్రుంగిపోయే హృదయం 
కనురెప్ప పాటున జీవితం 
కాలంతోపాటు గడిచిపోయే ఈ క్షణం 
తిరిగిరాని భవబందాలు
మరలరాని మధుర జ్ఞాపకాలు 
గతం ఒక గండభిన్దేరం
గతం జ్ఞాపకం ఒక స్వర్ణమయం 
అదే గతం జ్ఞాపకం ఒక కన్నీటిసంద్రం
వర్తమానం ఒక వింతనాటకం
నటిస్తూ గడిపే జీవన విదానం 
భవిష్యత్తు ఒక ఆశల కిరణం 
అదే భవిష్యత్తు ఒక సందేహమయం 
అదే భవిష్యత్తు ఒక ప్రణాళికపర్వం 
గతం నుంచి వర్తమానం 
రేపటి భవిష్యత్తు కోసం 
ఇంతేనా జీవితమంటే 
ఇంతేనా మనిషి మనుగడ అంటే 

!!!!!!!!!!!!
గరిమెళ్ళ రాజా



0 comments:

Post a Comment